చుక్క రక్తం లేకుండా కమర్షియల్ సినిమా చూపించావన్నారు: కోర్టు డైరెక్టర్ జగదీష్
నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ లో తెరకెక్కిన కోర్టు సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 12 March 2025 6:25 PM ISTనేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ లో తెరకెక్కిన కోర్టు సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో రామ్ జగదీష్ అనే కొత్త టాలెంట్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్ కోర్టుపై అంచనాల్ని పెంచేశాయి. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు రామ్ జగదీష్ పలు విషయాలను పంచుకున్నారు.
పోక్సో చట్ట నేపథ్యంలో కోర్టు సినిమా తెరకెక్కింది. ఇలాంటి కేసుని రియల్ లైఫ్ లో పరిశీలించానని, మొదటిసారి కేసు గురించి విన్నప్పుడు ఇలాంటి కేసులు కూడా ఉంటాయా అని అనుమానపడ్డానని చెప్పిన ఆయన ఎన్నో కేసుల మీద రీసెర్చ్ చేసి, వాటిని స్క్రీన్ పై చూపిస్తే బావుంటుందని కథ రాసుకున్నానని, ఎన్నో సంఘటనల నుంచి స్పూర్తి పొంది ఈ కథ ను రెడీ చేసుకున్నానని, కోర్టు కథ మొత్తం ఫిక్షనల్ అని ఆయన తెలిపారు. పోక్సో చట్టం గురించి చాలా స్టడీ చేసి దాని కోసం కోర్టు, లా, పోలీస్ సంస్థలకు సంబంధించిన ఎంతో మందిని కలిసి ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టు జగదీష్ తెలిపారు.
కోర్టు కథను నానికి చెప్పడానికి 8 నెలలు ఎదురుచూశానని చెప్పిన జగదీష్, నాని కథ విన్న విధానం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని, రెండున్నర గంటల కథను సింగిల్ సిట్టింగ్ లో ఆయన విన్నారని, కథ చెప్పడం పూర్తవగానే నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్‌కమ్ టు వాల్ పోస్టర్ సినిమా అన్నారని, నా లైఫ్ లో అది చాలా హై మూమెంట్ అని జగదీష్ అన్నారు.
కోర్టు రూమ్ కు సంబంధించిన ఎన్నో సినిమాలొచ్చాయి కానీ ఒక లవ్ స్టోరీ కోర్టు రూమ్ డ్రామాగా ఎప్పుడూ రాలేదని, ఈ సినిమాలో కోర్టు రూమ్ డ్రామాతో పాటూ లవ్ స్టోరీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని జగదీష్ తెలిపారు. ఈ సినిమాకు ప్రాణం లవ్ స్టోరీనే అని, సినిమాలోని ప్రతీ పాత్రను ఆడిషన్ చేసే తీసుకున్నామని ఆయన చెప్పారు.
జాబిల్లి పాత్ర కోసం ఎంతో మందిని చూశామని, తాము కోరుకున్న క్వాలిటీస్ అన్నీ ఉన్న అమ్మాయి కోసం ఎంతో ప్రయత్నించామని, ఇక దొరకదేమో అనుకునే టైమ్ లో ఇన్‌స్టా ప్రొఫైల్ చూసి శ్రీదేవిని ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. ప్రియదర్శి గురించి చెప్తూ తాను కోర్టు సినిమా ఐడియా ముందుగా తనకే చెప్పానని, కథ విన్న ప్రియదర్శి ఈ సినిమా నేనే చేస్తా, ఎవరికీ చెప్పొద్దన్నారని, ప్రియదర్శితో తనకు చాలా మంచి బాండింగ్ ఉందని, తనతో అన్నీ షేర్ చేసుకోగలనని జగదీష్ తెలిపారు.
కోర్టు మూవీ టెక్నికల్ గా కూడా చాలా రిచ్ గా ఉంటుందని, బేబీ మూవీతో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు కూడా చాలా సోల్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారని, కేవలం కథ విని దినేష్ పురుషోత్తమన్ డీఓపీగా చేశారని, వాల్ పోస్టర్ సినిమాస్ లో సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాడు జగదీష్. ఈ సినిమాకు ముందు తాను ఊర్వశివో రాక్షసివో, రారా క్రిష్ణయ్య సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని, తాను చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిందని ఆయన తెలిపారు.
నాని ఆల్రెడీ ఈ సినిమా చూశారని, సినిమాపై ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే నాని అంత నమ్మకంగా ఉన్నారని, కోర్టు సినిమా చూశాక నాని ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ అన్నారని, తనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదేనని, సినిమా చూసిన ఒకతను చుక్క రక్తం లేకుండా కమర్షియల్ మూవీ చేసి చూపించావన్నారు. ఆ మాట నాకు బాగా నచ్చిందని జగదీష్ చెప్పారు.