గడ్డం పెంచి బొద్దుగా మారిన చరణ్... కారణమదేనా?
ఉపాసన తన ఫ్యామిలీ తో కలిసి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేసింది.
By: Tupaki Desk | 28 Feb 2025 6:30 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు ఏదొక అప్డేట్ ఇస్తూ ఉండే ఉపాసన తాజాగా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉపాసన తన ఫ్యామిలీ తో కలిసి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేసింది.

అందరూ వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ ధరించి దిగిన ఈ ఫోటోలో రామ్ చరణ్ కొత్త లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేశాడు. చరణ్ కు సంబంధించిన ఈ కొత్త లుక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఉపాసన వైట్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తున్నప్పటికీ అందరి దృష్టి చరణ్ వైపే మళ్లుతుంది.
వైట్ అండ్ వైట్ వేసుకుని తలకు టోపీ పెట్టుకున్న రామ్ చరణ్ లుక్స్ ఈ ఫోటోలో హైలైట్ గా నిలిచాయి. చరణ్ ఫుల్ గా గడ్డం పెంచి, రఫ్ లుక్ లో మొరటుగా కనిపిస్తున్నాడు. అయితే చరణ్ నార్మల్ గానే ఇలా గడ్డం పెంచి ఈ లుక్ లోకి మారాడా లేదా బుచ్చిబాబు తో చేయనున్న RC16 కోసం చరణ్ ఇలా మేకోవర్ అయ్యాడా అని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు.
ఆల్ హార్ట్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటోలో రామ్ చరణ్ కేవలం గడ్డం పెంచడం మాత్రమే కాదు, లావుగా కూడా కనిపిస్తున్నాడు. మామూలుగా స్లిమ్ గా ఉండే చరణ్ ఒక్కసారిగా ఇలా లావుగా కనిపించడం చూసి ఇది కచ్ఛితంగా బుచ్చిబాబు సినిమా కోసమేనని అందరూ ఫిక్సైపోతున్నారు. ఏదేమైనా చరణ్ లుక్ వెనుక కారణం ప్రస్తుతానికైతే సస్పెన్స్ గానే మిగిలిపోగా, చరణ్ న్యూ లుక్ ఇదేనంటూ ఈ ఫోటోను మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. కేవలం లుక్ తోనే మీడియా అటెన్షన్ ను గ్రాబ్ చేసుకున్న చరణ్ ఆర్సీ16లో ఎలా కనిపించనున్నాడో అని చూడ్డానికి అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు.