Begin typing your search above and press return to search.

ఆ హీరో కూడా పిఠాపురం తాలూకాలా!

అయితే ఇప్పుడీ క్రేజ్ ని ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఎన్ క్యాష్ చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   8 March 2025 3:10 PM IST
ఆ హీరో కూడా పిఠాపురం తాలూకాలా!
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిసారి పిఠాపురం నియోజ‌క‌వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేప‌థ్యంలో పీకే పేరు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఓట్లు వేసినవారితో పాటు, ఆయ‌న అభిమానులు, జనసైనికులు అంతా పిఠాపురం తాలుకా అంటూ బైక్ ల మీద, కార్లు మీద స్టిక్కిరింగ్ చేయించుకుని ఏ రేంజ్ లో చ‌క్కెర్లు కొట్టారో తెలిసిందే. ఆ ర‌కంగా ఏపీలో పిఠాపురం కూడా బాగా వెలుగు లోకి వ‌చ్చింది.

దేశ వ్యాప్తంగా పిఠాపురం ఫేమ‌స్ గా మారింది. పిఠాపురాన్ని అంత‌ర్జాతీయంగా ట్రెండ్ చేస్తామంటూ అభిమాన‌లు ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడీ క్రేజ్ ని ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఎన్ క్యాష్ చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం రామ్ హీరోగా మ‌హేష్ బాబు. పి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ ఓ సినిమా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆన్ సెట్స్లో ఉంది. ఇంకా ఈ సినిమాకి టైటిల్ ఖ‌రారు కాలేదు.

ఈ నేప‌థ్యంలో `ఆంధ్రా కింగ్ తాలూకా` అంటూ ఓ టైటిల్ వెలుగులోకి వ‌స్తోంది. సినిమా స్టోరీకి..రామ్ పాత్ర‌కి ఈ టైటిల్ ప‌క్కాగా యాప్ట్ అవుతుంది. దీంతో మేక‌ర్స్ ఈ టైటిల్ ను సీరియ‌స్ గా ప‌రిశీలి స్తున్నారుట‌. ఇదే టైటిల్ పెడితే గ‌నుక టైటిల్ ట్రెండింగ్ లో నిలుస్తుంది. సినిమాకి మంచి బ‌జ్ వ‌స్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఇండ‌స్ట్రీ నుంచి కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. యూత్ స్టార్ నితిన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు వీరాభిమాని.

ఇలాంటి అభిమానులెంతో మంది ఆయ‌న‌కు ఉన్నారు. ఇదే టైటిల్ రామ్ సినిమాకి కూడా పెట్టుకుంటే? ఆయ‌న కూడా అభిమానిగా మారిన‌ట్లే. మ‌రేం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి. ఇందులో రామ్ సాగర్ అనే యుకుడి పాత్ర పోషిస్తున్నాడు. అత‌డు ప్రేమించిన అమ్మాయి మ‌హాల‌క్ష్మి అంటే భాగ్య శ్రీ బోర్సే. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది సినిమా రిలీజ్ కానుంది.