రామ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?
తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో రామ్ పోతినేని ఒకడు.
By: Tupaki Desk | 27 Feb 2025 8:04 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. తాను ఎలాంటి సినిమా చేసినా అందులో డిఫరెంట్ గా కనిపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే కావాల్సినంత టాలెంట్ ఉండి కూడా రామ్ మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు.
గొప్ప అందగాడు, ఎంతో మ్యాన్లీగా ఉండే రామ్ నటన, డ్యాన్సుల పరంగా కూడా ఇరగదీస్తాడు. ఎంత టాలెంట్ ఉంటే మాత్రం ఏం లాభం. సరైన కథలను ఎంచుకోలేకపోవడం వల్ల వరుస ఫ్లాపులు మూట గట్టుకుంటున్నాడు. పూరీ జగన్నాథ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ ఇప్పటివరకు మరో హిట్ అందుకుంది లేదు.
గతేడాది బోయపాటితో చేసిన స్కంద సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడనుకుంటే ఆ సినిమాతో చాలా పెద్ద ఫ్లాపును ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ తో పాటూ ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపైనే తమ ఆశలన్నింటినీ పెట్టుకున్నారు.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రామ్ కెరీర్లో 22వ చిత్రంగా రూపొందుతుంది. ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు వివేక్- మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం రామ్ పోతినేని లిరిక్ రైటర్ గా మారినట్టు తెలుస్తోంది.
రాపో22 సినిమాలో హీరో రామ్ ఓ లవ్ సాంగ్ ను రాశాడట. ఈ విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్ రామ్ లో ఈ హిడెన్ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. గతంలో హలో గురూ ప్రేమ కోసమే సినిమాలో ఓ సాంగ్ కోసం గొంతు విప్పిన రాపో ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా లిరిక్సే రాశాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.