ఎనర్జిటిక్ స్టార్ కూడా 2025లో మెగిస్తాడా?
నాగచైతన్య , శర్వానంద్, నితిన్ ఇప్పటికే ఓ ఇంటివారయ్యారు. మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ కూడా కొత్త ఏడాది పెళ్లి వార్త చెబుతున్నాడనే ప్రచారం జోరందుకుంది
By: Tupaki Desk | 31 Dec 2024 10:30 PM GMTనాగచైతన్య , శర్వానంద్, నితిన్ ఇప్పటికే ఓ ఇంటివారయ్యారు. మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ కూడా కొత్త ఏడాది పెళ్లి వార్త చెబుతున్నాడనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు పిల్లని వెతికే పనిలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి పెళ్లి ముహూర్తాల నేపథ్యంలో తేజ్ ఎప్పుడైనా పెళ్లి భాజాలు మోగించే అవకాశం ఉందంటున్నారు. వయసు కూడా 38 రావడంతో ఇక ఆలస్యం చేసేదేలే! అంటూ ఫ్యామిలీ ముందుకెళ్తుందిట.
మరి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పరిస్థితి ఏంటి? అంటే? అతడు భాజాలు మోగించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు కూడా పెళ్లి కుమార్తెను వెతికే పనిలో పడ్డట్లు లీకులందుతున్నాయి. రామ్ వయసు కూడా 36 దాటడంతో ఇంకే మాత్రం ఆలస్యం చేయకూడదని కుటుంబ సభ్యులు పిల్ల విషయంలో వేగంగా పావులు కదుపు తున్నట్లు తెలిసింది. రామ్ కు ఎలాంటి లవ్ స్టోరీలు కూడా లేవు. హీరోయిన్ తో ప్రేమాయణాలు నడిపినట్లు ఎప్పుడూ గాసిపు కూడా రాలేదు.
అతడు కంప్లీట్ గా క్లీన్ అండ్ గ్రీన్ గానే ఉన్నాడు. దీంతో పిల్లని వెతికే పని తల్లిదండ్రులకే రామ్ ఇచ్చేసాడు. మరి వచ్చే ఏడాది అయినా గుడ్ న్యూస్ చెబుతాడా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతానికి రామ్ పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెట్టాడు. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత హిట్ లేదు. వరుస పరాజయలే చూసాడు. `రెడ్`, `ది వారియర్`, `స్కంద`, `డబుల్ ఇస్మార్ట్` ఇలా వరుస ప్లాప్ లు చూసాడు. దీంతో ఇప్పుడు హిట్ కూడా కీలకంగా మారింది.
మంచి విజయం అందుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం 22వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` ఫేం మహేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. కొత్త ఏడాదిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.