Begin typing your search above and press return to search.

రామ్ ఈసారి గట్టిగానే..!

అందుకే మహేష్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా అంతా కొత్తగా ఉండేలా చూస్తున్నాడు. రామ్ లుక్ నుంచి ఈ సినిమా అంతా కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 4:15 AM GMT
రామ్ ఈసారి గట్టిగానే..!
X

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ వరుస ఫ్లాపులతో కెరీర్ కాస్త స్ట్రగులింగ్ లో ఉంది. ఓ పక్క యువ హీరోలు వరుస క్రేజీ సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. కానీ రామ్ మాత్రం సినిమాలు చేస్తున్నాడు కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోవట్లేదు. ఈ ఇయర్ వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా పోవడంతో రామ్ మరింత డీలా పడ్డాడు. రామ్ సినిమాల్లో సక్సెస్ కన్నా ఫెయిల్యూస్ ఎక్కువ. అయినా కూడా తను డీలా పడకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం రామ్ తన నెక్స్ట్ సినిమా మహేష్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మెప్పించిన డైరెక్టర్ మహేష్ రామ్ తో ఒక క్రేజీ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కథ మాత్రమే కాదు రామ్ లుక్ కూడా పూర్తిగా కొత్తగా ఉండబోతుంది. రామ్ లుక్ చూసి ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తెలుగు హీరోల్లో అటు మాస్ ఇటు క్లాస్ ఎలాంటి కథకైనా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కటౌట్ తనది.

కథల ఎంపికలో ఎంత జాగ్రత్త పడుతున్నా కూడా రామ్ కి సరైన సక్సెస్ రావట్లేదని చెప్పొచ్చు. ఈమధ్య యువ హీరోలు కూడా తమ వెరైటీ కథలతో 100 కోట్లు కూడా కొట్టేస్తున్నారు. కానీ రామ్ సినిమాలు మాత్రం ప్రేక్షకాదరణ పొందట్లేదు. అందుకే రామ్ ఇక మీద మరింత ఫోకస్ తో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మహేష్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా అంతా కొత్తగా ఉండేలా చూస్తున్నాడు. రామ్ లుక్ నుంచి ఈ సినిమా అంతా కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.

రామ్ కొత్త సినిమాలో మిస్టర్ బచ్చన్ భామ భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. అటు విజయ్ తో ఒక సినిమా చేస్తున్న భాగ్యం ఇప్పుడు రామ్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. తన అందంతో తెలుగు ఆడియన్స్ మనసుల్లో పర్మినెంట్ ప్లేస్ సంపాదించాలని అమ్మడు బాగానే ట్రై చేస్తుంది. కచ్చితంగా భాగ్య శ్రీకి రామ్ సినిమా లక్ కలిసి వచ్చేలా ఉందని చెప్పొచ్చు. రామ్ కూడా ఈ సినిమాతో చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. మరి మహేష్, రామ్ ఈ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే.