Begin typing your search above and press return to search.

రామ్ 'సాగర్' - వ్వాటే సడన్ సర్ ప్రైజ్!

రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం యువ దర్శకుడు మహేశ్ బాబు పి తో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Dec 2024 5:53 AM GMT
రామ్ సాగర్ - వ్వాటే సడన్ సర్ ప్రైజ్!
X

ఉస్తాద్ రామ్ పొతినేని మళ్ళీ రూటు మార్చాడు. మొన్నటివరకు కాస్త ఊరమాస్ క్యారెక్టర్లు చేసిన అతను ఇప్పుడు తన పాత ఫార్మాట్ లోకి వచ్చేశాడు. రామ్ లవర్ బాయ్ తరహా క్యారెక్టర్స్ తో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక పక్కింటి అబ్బాయి తరహాలో సాఫ్ట్ క్యారెక్టర్స్ అతనికి పర్ఫెక్ట్ గా సెట్టవుతాయని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం రామ్ అలాంటి క్యారెక్టర్ తోనే మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం యువ దర్శకుడు మహేశ్ బాబు పి తో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన P మహేశ్ బాబు, ఇప్పుడు రామ్‌తో ఓ వినూత్న కథతో ముందుకు వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ #RAPO22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఇక సినిమాలో రామ్ పాత్ర పేరు ‘సాగర్’ అని తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్‌లో రామ్ విన్టేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. మరింత కొత్తగా, క్లాసీగా కనిపించే రామ్ ఆకర్షణీయమైన ఫోటోతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు.

పాతకాలపు సైకిల్‌ ముందు అలా కాలు పైకి లేపుతూ హాయిగా నవ్వుతున్న రామ్ లుక్ హైలెట్ గా నిలిచింది. ఈ లుక్‌కి తగ్గట్టుగా సినిమా డిఫరెంట్ గా కొత్తగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. ఇక హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంతో సినిమా షూట్ జరుగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పోస్టర్ విడుదల తర్వాత, సినిమా గురించి అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

సాగర్ పాత్రలో రామ్ కనిపించనున్న ఈ సినిమా త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను అందించనుంది. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని వివేక్-మెర్విన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ మధు నీలకందన్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి హిట్ తర్వాత మహేశ్ బాబు పి ఈ సినిమాతో మరో విజయవంతమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.

రామ్ పాత్రలో కొత్తదనాన్ని, క్లాసిక్ టచ్‌ను చూసిన ప్రేక్షకులు సినిమాపై మరింత ఆసక్తి చూపుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రామ్ అభిమానులకు న్యూ ఎంటర్టైన్మెంట్ ట్రీట్ ఇవ్వనుంది. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. సినిమాలో ఒక ప్రముఖ స్టార్ కూడా ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.