సికింద్రాబాద్ కాలేజ్‌లో రామ్‌కి ఏం పని..!
ఈ సినిమా కోసం రామ్ సాగర్ అనే కాలేజ్ కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే లుక్ రివీల్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 17 Dec 2024 6:37 AM GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం మహేష్ బాబు.పి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరి కాంబో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు పి ఈ సినిమాను సైతం తనదైన శైలిలో రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం రామ్ సాగర్ అనే కాలేజ్ కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే లుక్ రివీల్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్ కోసం రామ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఒక కాలేజ్‌లో షూటింగ్ చేస్తున్నారు. కాలేజ్‌కి సంబంధించిన సన్నివేశాల షూట్ జరుగుతుందని, రామ్‌తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. భాగ్యశ్రీ వెంట పడే సన్నివేశాలతో పాటు, కొన్ని కాలేజ్ గొడవలకు సంబంధించిన సీన్స్‌ను సికింద్రాబాద్ కాలేజ్‌లో దర్శకుడు మహేష్ బాబు పి షూట్ చేస్తున్నాడు అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
రామ్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ ఓ భారీ కమర్షియల్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో రామ్ కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని మహేష్ బాబు పి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ సినిమాలో రామ్ పాత్ర ఆయన ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో రామ్ ను ఏ సినిమాలో చూడని విధంగా చూడబోతున్నారని, జగడం వంటి పాత్రతో రామ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు మరో వైపు ఇలా మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. మైత్రి బ్యానర్‌లో సినిమాలు వస్తే కచ్చితంగ ఆ భారీ రిలీజ్‌కి ఛాన్స్ ఉంటుంది. తద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అందుకే మైత్రి బ్యానర్‌లో నటించడం కోసం పలువురు హీరోలు ఆసక్తిగా ఉంటారు. ఇప్పుడ ఆ అవకాశం ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి వచ్చింది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.