Begin typing your search above and press return to search.

దేవర : తంగం అంతరంగం హాయిగా...!

తాజాగా ఆ పాటకు సంబంధించి రచయిత రామ జోగయ్య శాస్త్రి ఆసక్తికర ట్వీట్‌ చేసి అంచనాలు పెంచాయి.

By:  Tupaki Desk   |   30 July 2024 5:50 AM GMT
దేవర : తంగం అంతరంగం హాయిగా...!
X

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో షూటింగ్ ను ముగించేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం కీలకమైన ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ ల డ్యూయెట్‌ చిత్రీకరణ జరుపుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తాజాగా ఆ పాటకు సంబంధించి రచయిత రామ జోగయ్య శాస్త్రి ఆసక్తికర ట్వీట్‌ చేసి అంచనాలు పెంచాయి. దేవర నుంచి వచ్చిన మొదటి పాట ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ పాట తర్వాత రాబోతున్న పాట అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

వెయిట్‌ చేసినందుకు తగిన ఫలితం ఉంటుంది అంటూ రామ జోగయ్య శాస్త్రి ప్రకటించాడు. ఆయన ట్విట్టర్ లో... తంగం అంతరంగం హాయిగా ఉయ్యాల ఊగుతున్నట్లు ఉంటుంది ఇప్పుడే విన్నా అతి త్వరలోనే సాంగ్‌ వచ్చేస్తుంది అంటూ ట్వీట్‌ చేశాడు.

దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ పోషిస్తున్న పాత్ర పేరు తంగం అనే విషయం తెల్సిందే. ఆమె పేరు మీద ఈ పాట ఉంటుందని శాస్త్రి ట్వీట్ తో క్లారిటీ వచ్చింది. ఈ పాట లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ లు రొమాంటిక్ డాన్స్‌ తో అదరగొట్టబోతున్నారు అంటూ మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో పాటు, జాన్వీ కపూర్‌ మొదటి సారి తెలుగు లో నటిస్తున్న సినిమా ఇదే అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌ లో విడుదల అవ్వబోతున్న దేవర సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సెప్టెంబర్‌ చివరి వారంలో విడుదల అవ్వబోతున్న దేవర కి సీక్వెల్‌ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. దేవర హిట్‌ అయితే వెంటనే దేవర 2 ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.