దేవర.. ఇరగదీసే ఇంట్రో సాంగ్!
ఈ పాటను ఎన్టీఆర్, ఇతర తారాగణంపై రాత్రి వేళల్లో చిత్రీకరించారు. ఈ పాట "దేవర" సినిమా ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుందని సమాచారం.
By: Tupaki Desk | 12 Aug 2024 8:33 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ "దేవర" షూటింగ్ రోజురోజుకు మంచి హైప్ క్రియేట్ చేసుకుంటోంది. షూటింగ్ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన జనతా గ్యారేజ్ కు మించి దేవర సినిమా ఉండబోతోందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. సాంగ్స్ తో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌పై షూట్ చేస్తున్న పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్ పై అందరి దృష్టి ఉంది.
ఆయుధ పూజ నేపథ్యంతో ఈ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ మరియు అతని టీమ్ ఈ పాటను అత్యుత్తమంగా చిత్రీకరించే పనిలో ఉన్నారు ఇటీవలే ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సెట్స్‌ను సందర్శించి, టీమ్‌ను అభినందించారు. ఈ పాటను ఎన్టీఆర్, ఇతర తారాగణంపై రాత్రి వేళల్లో చిత్రీకరించారు. ఈ పాట "దేవర" సినిమా ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుందని సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ ఆయుధ పూజ సాంగ్ లో కూడా అతని డాన్స్ విజిల్స్ వేసే విధంగా ఉంటుందట. హీరో క్యారెక్టర్ ని కూడా ఎలివేట్ చేసే విధంగా రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ అందించినట్లుగా తెలుస్తోంది. ఇక అనిరుద్ ఈ పాటను కంపోస్ట్ చేయడానికి చాలా ఎక్కువ రోజులు సమయం తీసుకున్నట్లు సమాచారం. సినిమా క్లైమాక్స్ కు ముందు వచ్చే ఈ సాంగ్ సినిమా మూడ్ ను ఒక్కసారిగా చేంజ్ చేస్తుందట. అందుకే ఈ పాట విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మొత్తం షూటింగ్ దాదాపు పూర్తయిందని, కొన్ని ప్యాచ్ వర్క్ సీన్లు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. ఎన్టీఆర్, ఇతర తారాగణం సెప్టెంబర్ నుండి ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. ఈ నెలలోనే మరో సింగిల్ కూడా విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ బిజినెస్ మొత్తం పూర్తయిందని సమాచారం.
జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. "దేవర" చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను సూర్యదేవర నాగవంశీ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండటంతో బాలీవుడ్ లో కూడా ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.