Begin typing your search above and press return to search.

సినిమా పట్ల జవాబుదారీతనం ఆయన దగ్గర నేర్చుకున్నదే..!

సిరివెన్నెల సీతారామ శాస్త్రి శిష్యుడిగా రామజోగయ్య శాస్త్రి తన సినీ ప్రయాణం ఎలా మొదలైంది.

By:  Tupaki Desk   |   13 Aug 2024 3:42 AM GMT
సినిమా పట్ల జవాబుదారీతనం ఆయన దగ్గర నేర్చుకున్నదే..!
X

ప్రస్తుతం తెలుగులో ఉన్న గేయ రచయితలో రామజోగయ్య శాస్త్రి ఒకరు. ఆయన పాట రాశారంటే చాలు అది ప్రేక్షకులను అలరిస్తుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి శిష్యుడిగా రామజోగయ్య శాస్త్రి తన సినీ ప్రయాణం ఎలా మొదలైంది. ఇలాంటి విషయాల గురించి రీసెంట్ గా ఆయన చెప్పుకొచ్చారు. అసలు సిరివెన్నెల గారంటే ఎలా ఇష్టం పెరిగిందో చెబుతూ ఇంటర్ చదివే రోజుల్లో స్వర్ణకమలం సినిమా పాటలు రెండు లైన్ల లిరిక్స్ పేపర్ చూసి దాని మీద ఇష్టం ఉండటం వల్ల మిగతా సాహిత్యాన్ని పూర్తి చేశా.. అలాంటి పాటల్లో కొత్తగా రెక్కలొచ్చెలా సాంగ్ ఒకటని గుర్తు చేసుకున్నారు రామజోగయ్య శాస్త్రి.

ఇక ఇద్దరు కలిసి పనిచేయడం.. ఒక సినిమాకు ఇద్దరు కలిసి పాటలు రాయడం గురించి చెబుతూ.. అది ఊహకు కూడా అందని విషయమని.. భగవంతుడి దయ అని అన్నారు రామజోగయ్య శాస్త్రి. బెంగుళూరులో ఉద్యోగం చేసే టైం లో జానపద గీతాలు, సినిమా పాటలు రీమిక్స్ చేస్తుండేవాడిని.. కన్నడ గాయకులు ఎం.ఎల్ శాస్త్రి ద్వారా హీరో రవిచంద్రన్ దగ్గర చేరే అవకాశం వచ్చింది. అప్పట్లో ఆయన సినిమాలకు ఆయనే సంగీతం అందించే వారు.

ఆయన తీసిన ఏకాంగి లో ఎనిమిది పాటలకు తెలుగు వెర్షన్ రాస్తే.. రికార్డ్ టైం లో కృష్ణ వంశీ ఆ పాటలు విని డబ్బింగ్ పాటల్లా ఉన్నాయని అన్నారు. ఐతే అప్పటికి సాహిత్యం మీద అంత పట్టులేని నేను తోచినట్టుగా రాసిచ్చా.. ఐతే కృష్ణవంశీ మళ్లీ పాటలు తిరగరాయమంటే కుదరదని చెప్పగా వాటిని సిరివెన్నెల గారితో 3 పాటలు.. కులశేఖర్ తో రెండు పాటలు రాయించారు.

ఆ టైం లోనే రాసిన పాటలు చూపించి నా పాటలో ఏదో కొరత ఉంటుంది. మీ దగ్గర శిష్యరికం చేస్తా అని శాస్త్రి గారిని అడిగా.. అందుకు ఆయన వెంటనే ఒప్పుకున్నారు. కొంత పారితోషికం కూడా ఆఫర్ చేశారు కానీ నా సాహిత్యాన్ని పదును పెట్టుకోవాలని కున్నా తప్ప పారితోషికం వద్దని చెప్పానని రామజోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చారు. శాస్త్రి గారు రాత్రి పాటలు రాస్తుంటే.. రోజంగా వేరే చోట ఉద్యోగం చేసి రాత్రి ఆయన దగ్గర సాహిత్యం నేర్చుకునే వాడిని.. అలా మొదలైంది మా ఇద్దరి ప్రయాణమని అన్నారు రామజోగయ్య శాస్త్రి.

అలా శాస్త్రి గారి దగ్గర చేరాకనే పరిపూర్ణత వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అప్పటికి నాలో ఉన్న జ్ఞానాన్ని ఎలా వినియోగించాలి అన్నది శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నా.. ప్రతి మనిషిలో ఆలోచన పరిజ్ఞానాన్ని మంచికీ, చెడుకీ రెండిటికీ వాడొచ్చు. ఆయనతో సాంగత్యం వల్ల మంచి మార్గం వైపు అడుగులు పడ్డాయి. సినిమా పట్ల ఎంత జవాబుదారీతనంతో ఉండాలి అన్నది శాస్త్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నా.. 15 మాటల పాటలో మనం ఎలాంటి అర్ధాన్ని, భావాన్ని చెబుతున్నాం.. ప్రపంచానికి ఏం ఉప్బోధిస్తున్నాం అనేది అందరికీ కనిపించదు.. ఒక రచయిత మాత్రమే అది అర్ధం చేసుకుంటాడు. ఆయన లేకపోతే నా ప్రయాణానికి అర్ధమే లేదని అన్నారు రామజోగయ్య శాస్త్రి. నేను మాత్రమే కాదు నాకంటే ముందు రచయితలు కూడా శాస్త్రి గారి నుంచి స్పూర్తి పొందివారే. ఆయన చాలామంది గేయ రచయితల్లో మార్పుని తీసుకొచ్చారు. ఆయనకి కూడా కొన్నిసార్లు సవాళ్లు ఎదురయ్యాయి. కానీ వాటిని తట్టుకుని ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారని అన్నారు రామజోగయ్య శాస్త్రి.