ఫాదర్స్ డే: కూతురి ఫేస్ చూపించిన చరణ్
చరణ్ కుమార్తె క్లిన్ కారా ముఖాన్ని చూడాలనే ఆసక్తి అభిమానులకు ఉంది.
By: Tupaki Desk | 16 Jun 2024 10:28 AM GMTఉపాసన కూతురు క్లిన్ కారా ముఖం బయటపెట్టింది. చిత్రాన్ని ఒక ఇంటర్వ్యూలో, రామ్ చరణ్ క్లిన్ కారాకు చిరంజీవి ఎలాంటి తాత, ఆమె భవిష్యత్తుపై అతని ఆశలు మరియు మరిన్నింటి గురించి తెరిచాడు.
ఫాదర్స్ డే 2024 చాలా ప్రత్యేకమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన కుమార్తె క్లిన్ కారా ముఖారవిందాన్ని స్పష్ఠంగా చూపించాడు. మెగాభిమానులకు ఇది కొంత సర్ ప్రైజ్ అని చెప్పాలి. చరణ్ కుమార్తె క్లిన్ కారా ముఖాన్ని చూడాలనే ఆసక్తి అభిమానులకు ఉంది. కానీ ఇప్పటివరకూ చూసే అవకాశం కలగలేదు.
ఇంతకాలానికి సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ లో బేబి క్లిన్ కారా ముఖాన్ని వీక్షించే అవకాశం కలిగింది. క్లిన్ ఈ ఫోటోగ్రాఫ్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. రామ్ చరణ్ క్యూట్ క్లిన్ కారాను తన చేతుల్లోకి ఎత్తుకుని ఉన్నప్పటి స్వీటెస్ట్ ఫోటోను షేర్ చేసారు.
కూతురితో పోటీపడనన్న చెర్రీ:
ఫాదర్స్ డే రోజున రామ్ చరణ్ టైమ్స్ ఆఫ్ ఇండియా చిట్ చాట్ లో తన కూతురు తన బాటలో కాకుండా తన భార్య ఉపాసన అడుగుజాడల్లో నడుస్తుందని తాను ఆశిస్తున్నానని వెల్లడించాడు. మెగా కుటుంబం నుండి తగినంత మంది నటులు ఉన్నందున, తన కుమార్తెతో పోటీ పడటం తనకు ఇష్టం లేదని చరణ్ పేర్కొన్నాడు. అమ్మ వైపు ఆలోచిస్తేనే అది గొప్పగా ఉంటుందని నేను భావిస్తున్నాను.. ఎందుకంటే నా వైపు చాలా మంది సినీనటులు ఉన్నారు. మేము సంవత్సరంలో చాలా విడుదలలతో గందరగోళంలో ఉంటాము. మేమంతా ఒకరి సినిమాలతో ఇంకొకరి విడుదల తేదీల కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు ఈ స్పేస్ లో నా కూతురితో ఫైట్ చేయడం నాకు ఇష్టం లేదు... అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఉపాసన ఒక వ్యాపారవేత్త.. అపోలో సంస్థానంలో కీలక పదవిలో ఉన్నారు. ఇప్పుడు క్లిన్ కారా కూడా అపోలో సంస్థానంలోనే బాధ్యతలు నిర్వర్తించాలనేది చెర్రీ ఆలోచన కావొచ్చు. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్ సహా చరణ్ కజిన్స్‌లో చాలా మంది నటులే పరిశ్రమలో ఉన్న సంగతి తెలిసిందే.
చిరంజీవి తాతగా క్లిన్ తో చాలా ప్రేమగా ఉంటారని రామ్ చరణ్ వెల్లడించారు. తెలుగులో క్లిన్ ని `తథా` అని కాకుండా ప్రత్యేకమైన పేరుతో పిలవాలని నాన్న (చిరంజీవి) కోరుకుంటున్నట్లు తెలిపారు. నాన్న గారు ఏమంటారంటే.. ``నన్ను తాత అని పిలవకండి.. అది విసుగ్గా ఉంది.. నన్ను `చిరుత` అని పిలవండి అని చిరు కోరార``ని చరణ్ అన్నారు. అంటే క్లిన్ తనను తాత అని కాదు చిరుత అని పిలవాలి.
2007లో రామ్ చరణ్ నటించిన తొలి చిత్రానికి చిరుత అనే పేరు పెట్టారు. పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు చిరంజీవిని క్లిన్ కారా అదే పేరుతో పిలవాలన్నమాట.