Begin typing your search above and press return to search.

రాముడు - రావ‌ణుడి మ‌ధ్య వార్!

తాజాగా ఆ స‌మ‌యం రానే వ‌చ్చేసింది. రావ‌ణుడి పాత్ర‌కు సంబంధించి షూటింగ్ ముంబైలో ప్రారంభ మైన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Feb 2025 11:30 AM GMT
రాముడు - రావ‌ణుడి మ‌ధ్య వార్!
X

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితిష్ తివారీ ఇతిహాసం `రామాయ‌ణం` ఆధారంగా `రామాయ‌ణ్` ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్.. సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి...రావ‌ణుడి పాత్ర‌లో య‌శ్..హ‌నుమంతుడి పాత్ర‌లో స‌న్నిడియోల్ లాంటి స్టార్లతో భారీ కాన్సాస్ పై తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన పాత్ర‌ల‌పై షూటింగ్ జ‌రుగుతోంది. అయితే రావ‌ణుడు మాత్రం ఇంకా సెట్స్ లో అడుగు పెట్ట‌లేదు.

తాజాగా ఆ స‌మ‌యం రానే వ‌చ్చేసింది. రావ‌ణుడి పాత్ర‌కు సంబంధించి షూటింగ్ ముంబైలో ప్రారంభ మైన‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రావ‌ణుడిపై స‌న్నివేశాల‌కు ప్ర‌త్యేక‌మైన గ్రీన్ మ్యాట్ సిద్దం చేసారు. ఆ గ్రీన్ మ్యాట్ పై రాముడు-రావ‌ణుడి మ‌ధ్య యుద్ద స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. అయితే ఇందులో కేవ‌లం రావ‌ణుడి పై మాత్రమే యుద్ద స‌న్నివేశాలు చిత్ర‌క‌రిస్తున్నారట‌.

రాముడు ర‌ణ‌బీర్ క‌పూర్ త్వ‌ర‌లోనే షూట్ లో జాయిన్ అవుతాడ‌ని స‌మాచారం. రామ‌-రావ‌ణుడి మ‌ధ్య యుద్దం అంటే బాణం వార్. ఇరువురు బాణాలు సంధించుకుని యుద్దానికి తెర తీస్తారు. ఈ నేప‌థ్యంలో య‌శ్ పై మాత్రమే సోలోగా ఈ సీన్స్ ముందుగా షూట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. య‌శ్ వెర్ష‌న్ పూర్త‌యిన త‌ర్వాత ర‌ణ‌బీర్ వెర్ష‌న్ మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. అటుపై మ‌రిన్ని వార్ స‌న్నివేశాలు ఇద్ద‌రి కాంబోలో ఉంటాయ‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణకు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారట‌. గ్రీన్ మ్యాట్ సెట్ అంతా చాలా నేచుర‌ల్ గా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ స‌న్నివేశాల‌కు సంబంధించి సీజీ వ‌ర్క్ కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని సాంకేతిక విభాగం చెబుతుంది. దీనికి సంబంధించిన ప‌నులు హాంగ్ కాంగ్ స్టూడియోలో జ‌రుగుతాయని స‌మాచారం.