Begin typing your search above and press return to search.

రామయణంకు రూ.835 కోట్లు.. ఎందుకు అంత బడ్జెట్‌?

నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం పై అందరిలో కూడా ఆసక్తి ఉంది.

By:  Tupaki Desk   |   14 May 2024 1:19 PM GMT
రామయణంకు రూ.835 కోట్లు.. ఎందుకు అంత బడ్జెట్‌?
X

ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎన్నో సార్లు రామాయణం సినిమాలు వచ్చాయి. గత ఏడాది కూడా ప్రభాస్ హీరోగా రామాయణం సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరో రామాయణం సినిమా రూపొందబోతుంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం పై అందరిలో కూడా ఆసక్తి ఉంది.

నమిత్ మల్హోత్ర నిర్మిస్తున్న రామాయణంలో బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ రణబీర్ కపూర్‌ రాముడిగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను నమిత్‌ మల్హోత్ర ఏకంగా రూ.835 కోట్ల బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సినీ వర్గాల వారికి కూడా షాకింగ్ గా ఉన్నాయి.

ఒక సినిమాకు ఇప్పటి వరకు అయిదు వందల కోట్లు అంటే బాబోయ్ అన్నట్లుగా అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు రామాయణం సినిమా కోసం నితేష్ తివారీ ఏకంగా రూ.835 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు అనే వార్తలు అందరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

భారీ స్టార్‌ కాస్టింగ్‌ తో పాటు, భారీ టెక్నికల్‌ అంశాలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అందుకే ఇంత బడ్జెట్‌ ఖర్చు అవ్వబోతుంది అంటున్నారు. ఇప్పటికే అనుకున్న బడ్జెట్‌ పెరుగుతూనే ఉంది. సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి, సినిమా విడుదల అయ్యే వరకు ఈ బడ్జెట్‌ రూ.1000 కోట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

ఇప్పటికే సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఆ మధ్య రాముడు, సీత గెటప్‌ లో రణబీర్‌ కపూర్ మరియు సాయి పల్లవిల లుక్ లీక్ అయ్యింది. అప్పటి నుంచి ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. 600 రోజుల పాటు షూటింగ్‌ నిర్వహించబోతున్న ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.