Begin typing your search above and press return to search.

రామాయ‌ణం షూటింగ్ ఆగిపోయిందా?

ర‌ణ‌బీర్ క‌పూర్- సాయి ప‌ల్ల‌వి -య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో `రామాయ‌ణం` భారీ కాన్వాస్ పై తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 May 2024 7:26 AM GMT
రామాయ‌ణం షూటింగ్ ఆగిపోయిందా?
X

ర‌ణ‌బీర్ క‌పూర్- సాయి ప‌ల్ల‌వి -య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో `రామాయ‌ణం` భారీ కాన్వాస్ పై తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజుల క్రిమ‌తే షూటింగ్ మొదలైంది. ర‌ణ‌బీర్ క‌పూర్-సాయి ప‌ల్ల‌వి కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరిస్తున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. షూటింగ్ స్పాట్ నుంచి హీరో-హీరోయిన్ల ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. రాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ ..సీత‌ పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి అద్భుత‌మైన ఆహార్యంలో రామ‌-సీత‌ల‌నే త‌ల‌పించారు.

ఆ పాత్ర‌ల‌కు ప‌ర్పెక్ట్ జోడీగా ఆ ఇద్ద‌రు సెట్ అవ్వ‌డంతో సినిమాపై ఆస‌క్తి మరింత పెరిగింది. య‌శ్ లంకేశ్వ‌రుడి పాత్ర అంతే ఆస‌క్తిని క‌ల‌గ‌జేస్తుంది. ఆపాత్ర‌కి సంబంధించి రోజుకో అప్ డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని అంత‌కంత‌కు రెట్టింపు చేస్తోంది. ఇంకా సినిమాలో కీలక పాత్ర‌ల్ని స్టార్ హీరోల్నే రంగంలోకి దించుతున్నారు. ఇలా ప్ర‌తీ విష‌యం రామాయ‌ణంని అంత‌కంత‌కు ఆకాశానికి తీసుకెళ్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్రేక్ష‌కాభిమానులు షాక్ అయ్యే వార్త బయ‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా షూటింగ్ అర్దంత‌రంగా ఆపేసారుట‌. అందుకు కార‌ణంగా అగ్రిమెంట్ స‌వ్యంగా జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్లే బ్రేక్ ప‌డింద‌ని తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం ‘అల్లు మంతెన మీడియా వెంచర్స్ ఎల్‌ఎల్‌పి’ సంస్థ ఈ చిత్ర బృందానికి నోటీసు పంపింది. దాని ప్రకారం ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం `రామాయణం` చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్‌కి సంబంధించిన కొన్ని హక్కులను కొనుగోలు చేశారు. దానికి సంబంధించి ప్రక్రియ పూర్ది కాలేదు. దీంతో చిత్ర నిర్మాత‌ల‌కు నోటీసులు అందాయి. అయినా దాంతో సంబంధం లేకుండా కొన్ని రోజులు షూటింగ్ చేసారు. అయితే గ‌త వారం నుంచి షూటింగ్ ఆపేసారు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది.

సినిమాకి సంబంధించి లీగల్ ఇష్యుస్ పరిష్కారమ‌య్యే వ‌ర‌కూ షూటింగ్ నిర్వహించ‌కూడ‌ద‌ని నిర్మాత‌లు డిసైడ్ అయ్యారుట‌. ఈ నేప‌థ్యంలో షూటింగ్ ఆపేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ వివాదాలు అన్ని ప‌రిష్కార‌మైన త‌ర్వాత మ‌ళ్లీ షెడ్యూల్ వేయాల్సి ఉంది. ఇప్పటికే చాలా మంది న‌టీన‌టులు సినిమాకి డేట్లు కేటాయించారు. బ్రేక్ నేప‌థ్యంలో మ‌ళ్లీ వాళ్లంతా రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఆర‌కంగా న‌టీన‌టుల‌కు కాస్త అసౌక‌ర్యం క‌లిగిన‌ట్లే.