Begin typing your search above and press return to search.

రామమందిరం-రామాయణం స్ఫూర్తితో 4 సినిమాలు

అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవానికి భార‌త‌దేశంలోని అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల నుంచి ప్ర‌ముఖులు ఆహ్వానాలు అందుకున్నారు

By:  Tupaki Desk   |   11 Jan 2024 5:08 PM GMT
రామమందిరం-రామాయణం స్ఫూర్తితో 4 సినిమాలు
X

అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవానికి భార‌త‌దేశంలోని అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల నుంచి ప్ర‌ముఖులు ఆహ్వానాలు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్, అమీర్ ఖాన్ స‌హా చాలా మంది పెద్ద స్టార్లు ఆహ్వానాలు అందుకున్న‌వారిలో ఉన్నారు. అలియా భట్, రణబీర్ కపూర్, రణదీప్ హుడా, టైగర్ ష్రాఫ్‌ సహా చాలామంది బాలీవుడ్ ప్రముఖులను ఈ వేడుక‌కు ఆహ్వానించారు. ఇది పురాణాలు, రామాయణం లేదా రామమందిరం ఆధారంగా సినిమాలకు స్ఫూర్తినిస్తుందా? అంటే .. ఇప్పటికే చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న సినిమాల‌ను ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి. రామమందిరం, రామాయణం ఆధారంగా రానున్న‌ సినిమాల జాబితా ఇలా ఉంది.

నితేష్ 'తివారీ రామాయణం' 2023లో అత్యంత చ‌ర్చ‌నీయాంశ‌మైన ప్రాజెక్ట్. పురాణేతిహాసం రామాయ‌ణ గాధ‌ ఆధారంగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన 'రామాయ‌ణం' ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిని పెంచుతోంది. నితీష్ తివారీ మూడు భాగాల చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారాగణం ఎవ‌రు అన్న‌ది అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. ఇందులో శ్రీ‌రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణ్‌గా నవీన్ పోలిశెట్టి, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపిస్తారని ప్ర‌చార‌మైంది. రావ‌ణుడి పాత్ర‌లో కేజీఎఫ్ య‌ష్ ని ఆడిష‌న్ చేసార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. కానీ అధికారికంగా వాస్త‌వాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

తేజస్ విడుదలకు ముందు, కంగనా రనౌత్ శ్రీ‌రాముని ఆశీర్వాదం కోసం నిర్మాణంలో ఉన్న రామమందిరాన్ని సందర్శించారు. అయోధ్యపై సినిమా చేయడానికి తన వద్ద స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని కంగ‌న‌ వెల్లడించింది. చివరికి శ్రీ‌రాముని ఆలయం నిర్మిత‌మైంది. ఇది హిందువుల శతాబ్దాల పోరాట విజ‌యంగా చ‌రిత్ర‌కెక్క‌నుంది. మ‌న త‌రం శ్రీ‌రామ మందిరాన్ని చూడ‌బోతోంది. నేను అయోధ్యపై ఒక స్క్రిప్ట్ రాశాను.. దీనిపై పరిశోధన కూడా చేసాను. ఇది దేశ ప్ర‌జ‌ల‌ 600 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం.. ఈ రోజు మోడీ ప్రభుత్వం .. సిఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల సాధ్యమవుతోంది... వాటికన్ క్రైస్తవులకు ఉన్నట్లే హిందువులకు ఇది అతిపెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది... ఇది దేశానికి సనాతన సంస్కృతికి గొప్ప చిహ్నం.. ప్రపంచం ముందు...మా తేజస్ చిత్రంలో రామమందిరం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది! అని కంగనా రనౌత్ విలేకరులతో అన్నారు. దీనిని బ‌ట్టి రామాయ‌ణంపై కంగ‌న‌ సినిమా తెర‌కెక్కించ‌నున్నార‌ని అర్థ‌మైంది.

రామానంద్ సాగర్ రామాయణంలో రాముడి పాత్రను పోషించిన‌ నటుడు అరుణ్ గోవిల్ అయోధ్యలో రామమందిర ఆలయ నిర్మాణ సమయంలో జరిగిన పోరాటం, త్యాగం గురించి '695: ట్రయంఫ్ ఆఫ్ ఫెయిత్' అనే సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. భగవాన్ రామ్‌కు పర్యాయపదంగా ఉన్న ప్రముఖ నటుడు రామానంద్ మాట్లాడుతూ, ''మిలియన్ల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న.. కలకాలం స్థిరంగా అల‌రించే అద్భుత‌ కథనాన్ని మళ్లీ సందర్శించడం గౌరవంగా భావిస్తున్నాను. 695 కేవలం సినిమా కాదు.. ఇది ఒక వేడుక. మన సాంస్కృతిక వారసత్వం .. విశ్వాసం తాలూకా విజయం'' అని అన్నారు. గోవిల్‌తో పాటు, ఈ చిత్రంలో గోవింద్ నామ్‌దేవ్, ముఖేష్ తివారీ, అశోక్ సమర్థ్, మనోజ్ జోషి, కెకె రైనా, శైలేంద్ర శ్రీవాస్తవ్, దయాశంకర్ పాండే, వికాష్ మహంతే, సుశీలాజీత్ సహానీ, గరిమా అగర్వాల్ త‌దిత‌రులు నటించనున్నారు.

ప్రశాంత్ వర్మ హీరోగా తెరకెక్కుతున్న హనుమాన్ ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రజల హృదయాలను గెలుచుకుంది. పౌరాణిక క‌థాంశంలో సూపర్‌హీరోగా తేజ సజ్జ న‌టిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ త‌దిత‌రులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ సినీ విశ్వంలో ఇదే మొదటి సినిమా. తదుపరి చిత్రానికి అధిర అనే టైటిల్ పెట్టనున్నారు. హనుమాన్ కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు.. ఇది ఒక పౌరాణిక‌ సినిమా ఆద‌ర‌ణ‌కు నాంది.. ఇది ప్రత్యేకమైన భారతీయతో మాయాజాలాన్ని ప్రేక్షకులపై ప్ర‌స‌రించ‌నుంది. ఈ ప్రయాణం మనందరికీ ఒక ఉత్తేజకరమైన సాహసం .. దాని గురించి చాలా గర్వపడుతున్నాము. దీనిని సృష్టించాను'' అని హనుమాన్ ట్రైలర్ లాంచ్‌లో చెప్పారు. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నారు.