Begin typing your search above and press return to search.

రామాయణం మూవీ… అప్పటివరకు ఎదురుచూడాల్సిందే..

కథ, కథనం పెర్ఫెక్ట్ గా ఉంటే వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయని రాజమౌళి నిరూపించారు.

By:  Tupaki Desk   |   15 May 2024 4:10 AM GMT
రామాయణం మూవీ… అప్పటివరకు ఎదురుచూడాల్సిందే..
X

బాహుబలి సిరీస్ తో రాజమౌళి ఇండియాలో భారీ సినిమాలు చేయాలని అనుకునే దర్శక, నిర్మాతలకి ధైర్యం ఇచ్చాడని చెప్పొచ్చు. బాహుబలి రెండు భాగాలని 440 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించారు. వీటికి టోటల్ గా 2500 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కథ, కథనం పెర్ఫెక్ట్ గా ఉంటే వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయని రాజమౌళి నిరూపించారు.

అతన్ని స్ఫూర్తిగా తీసుకొని తరువాత చాలా మంది దర్శకులు వందల కోట్ల బడ్జెట్ తో మూవీస్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక బడ్జెట్ మూవీగా ప్రస్తుతం కల్కి తెరకెక్కుతోంది. కల్కి కోసం 600 కోట్లకు పైగా ఖర్చు చేస్తుండగా.. ఇక అంతకుమించి ఏకంగా 800+ కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ లో నితీష్ తివారి రామాయణం సిరీస్ ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ కోసం మెయిన్ క్యాస్టింగ్ ని నితీష్ తివారి కన్ఫర్మ్ చేసేశారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. రాకింగ్ స్టార్ యష్ లంకేశ్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని వీలైనన్ని ఎక్కువ భాషలలో తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతోంది. విజువల్ వండర్ గా రామాయణం చిత్రాన్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నారు.

దానికోసం నితీష్ తివారి టీమ్ ఎప్పటి నుంచో కసరత్తు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా 2027లో రిలీజ్ కానుందంట. అంటే మూడేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ జరగబోతోందని తెలుస్తోంది. రామాయణం కథతో ఇండియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటారు. అందుకే స్టోరీ నేరేషన్ లో ఎలాంటి వివాదాలకు తావివ్వలేకుండా అద్భుతమైన దృశ్యకావ్యంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

మూడేళ్ళ పాటు ఈ సినిమాని తెరకెక్కిస్తే ఆటోమేటిక్ గా మూవీపై అంచనాలు పెరుగుతాయి. అలాగే అప్పటికి సినిమా మార్కెట్ కూడా భారీగా విస్తరిస్తుంది. వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి డోర్స్ ఓపెన్ అవుతాయి. మన కథలని చూడటానికి ఇతర దేశాల వారు ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంటుంది. ఆ స్కోప్ ని ఈ మూడేళ్ళలో రాబోయే ఇండియన్ సినిమాలు క్రియేట్ చేయనున్నాయి. దీంతో రామాయణం సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.