Begin typing your search above and press return to search.

శ్రీ‌కృష్ణుని క‌థ‌తో పాన్ ఇండియ‌న్ సినిమా

`రామాయణ్‌` నిర్మాతలు శ్రీమద్ భాగవతం నుండి శ్రీకృష్ణుని పురాణేతిహాస‌ కథలను వెండితెర‌కెక్కించనున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 8:30 AM GMT
శ్రీ‌కృష్ణుని క‌థ‌తో పాన్ ఇండియ‌న్ సినిమా
X

`రామాయణ్‌` నిర్మాతలు శ్రీమద్ భాగవతం నుండి శ్రీకృష్ణుని పురాణేతిహాస‌ కథలను వెండితెర‌కెక్కించనున్నారు. ప్ర‌జ‌లు మరచిపోలేని పురాణేతిహాసం రామాయణం టెలివిజన్ సిరీస్ వెనుక ప‌ని చేసిన‌ బృందం సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక కొత్త పురాణేతిహాస క‌థ‌తో సినిమాను ప్రారంభించింది. వారు శ్రీమద్ భాగవతం ఇతిహాసాన్ని సినిమాగా, అలాగే టెలివిజన్ సిరీస్ గా రెండు వెర్ష‌న్ల‌లోను తెర‌కెక్కించ‌నున్నారు. లార్డ్ శ్రీకృష్ణుని కథలను పూర్తిగా కొత్త తరానికి చూపించేందుకు తెర‌పై జీవం పోస్తారు.

ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలతో ఒక పోస్ట్‌లో X(గతంలో ట్విట్టర్ )లో ధృవీకరించారు. ఆయ‌న వివ‌రాల ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప‌లు చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులతో పాన్-ఇండియన్ తారాగణాన్ని కలిగి ఉంటుంది. అగ్రశ్రేణి విజువల్ ఎఫెక్ట్స్ కోసం సాగర్ పిక్చర్స్ ప్రముఖ అంతర్జాతీయ VFX కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంద‌ని తెలిసింది.

తారాగణం, సిబ్బందికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. శ్రీ‌మ‌ద్ భాగ‌వతం వంటి గొప్ప గ్రంధం ఆధారంగా పురాణేతిహాసాల‌ను పరిశోధించి తీస్తున్న సినిమా గ‌నుక స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఇటీవ‌ల రామాయ‌ణం పురాణేతిహాసం ఆధారంగా ఓంరౌత్ రూపొందించిన ఆదిపురుష్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. అలా కాకుండా ఇప్పుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం.