Begin typing your search above and press return to search.

రామాయ‌ణం VFX నోల‌న్ క‌నెక్ష‌న్

ప్ర‌భాస్ 'ఆదిపురుష్‌' పరాజయం తర్వాత ఈ మూడు భాగాల సినిమాపై అంద‌రి దృష్టి ఉంది. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి

By:  Tupaki Desk   |   15 March 2024 4:15 AM GMT
రామాయ‌ణం VFX నోల‌న్ క‌నెక్ష‌న్
X

నితేష్ తివారీ 'రామాయణం' మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ ఫ్రాంఛైజీల‌లో ఒకటి. అన్ని ప‌రిశ్ర‌మ‌ల నుంచి అద్భుతమైన న‌ట‌ప్రతిభను ఒకచోట చేర్చే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. రణబీర్ కపూర్ నుండి సన్నీ డియోల్ వరకు, సాయి పల్లవి నుండి KGF స్టార్ యష్ వరకు ఈ చిత్ర తారాగణం ప్రస్తుతానికి చాలా ఉత్సుక‌త పెంచుతోంది. అయితే న‌టీన‌టుల ఎంపిక‌, సినిమా లాంచ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్ర‌భాస్ 'ఆదిపురుష్‌' పరాజయం తర్వాత ఈ మూడు భాగాల సినిమాపై అంద‌రి దృష్టి ఉంది. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఓం రౌత్ (ఆదిపురుష్ దర్శకుడు) కూడా దీని కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే అత‌డు సాంకేతిక‌త‌ను వినియోగించుకోవ‌డంలో ఫెయిల‌య్యాడు. అదే స‌మ‌యంలో పాత్ర‌ల్ని తీర్చిదిద్ద‌డంలో ఇత‌ర విష‌యాల్లో కూడా విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. అయితే ఇలాంటి భారీ చిత్రాల‌కు వీఎఫ్ఎక్స్ ని స‌మ‌ర్థంగా వినియోగించ‌డం అంత సులువేమీ కాదు. సాంకేతిక నిపుణుల నుంచి కావాల్సిన ఔట్ పుట్ ని తెలివిగా రాబ‌ట్టుకోవాలి. ఇప్పుడు నితీష్ జీ అదే ప‌నిలో ఉన్నాడు. దీనికోసం అత‌డు దిగ్గ‌జ సంస్థ‌ల్ని సంప్ర‌దిస్తున్నాడు.

నితేష్ తివారీ రామాయణం వెనుక VFX కంపెనీ ఏది? అన్న‌ది చూస్తే.. ఇటీవ‌ల 7 ఆస్కార్ లు అందుకున్న ఓపెన్ హైమ‌ర్ (nolan), ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఆడుతున్న డ్యూన్ చిత్రాల‌కు వీఎఫ్ ఎక్స్ అందించిన కంపెనీ ప‌ని చేయ‌నుంద‌ని తెలిసింది. బ్రిటీష్ విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ యానిమేషన్ మరియు స్టీరియో కన్వర్షన్ స్టూడియో DNEG CEO రామాయ‌ణం కోసం ప‌ని చేయ‌నుంది. ఈ కంపెనీ ఓపెన్ హైమ‌ర్, ఇన్సెప్ష‌న్, ఇంట‌ర్ స్టెల్లార్, ఎక్స్ మెచీనా, బ్లేర్ ర‌న్న‌ర్ 2049, ఫ‌స్ట్ మేన్, టెనెట్, డూన్ వంటి చిత్రాల‌కు వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ ని అందించింది. ఈ సంస్థ ఎనిమిది ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.

రామాయ‌ణం పూర్తిగా కొత్త పంథాలో హై-ఆక్టేన్ విజువల్స్‌తో భారీ స్థాయిలో తెర‌కెక్కుతోంది. నిర్మాత నమిత్ రాజీ లేకుండా పెట్టుబ‌డుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. నితేష్ తివారీ తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక పరికరాలు, సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో కూడిన అతిపెద్ద టీమ్‌లలో ఒకటిగా అవతరించనుంది. వారంతా నితీష్ తివారీ దర్శకత్వంలో పని చేస్తారు. గ్రాండ్ VFX టీమ్ అతిపెద్ద తారాగణంతో మెగా కాంబో సెట్‌ను నితీష్ ఏర్పాటు చేసుకుంటున్నారు. రామాయణతో వేవ్స్ క్రియేట్ చేయాల‌న్న‌ది అత‌డి ఆలోచ‌న‌. ఏప్రిల్ లో ఈ సినిమాని అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.