Begin typing your search above and press return to search.

వీడియో: విమానాశ్ర‌యంలో కెమెరాకు చిక్కిన బ్రొమాన్స్

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌హా ప్ర‌చారంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ న‌డుమ అనుబంధం గురించి అభిమానులు ఎంతో చ‌ర్చించుకున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 8:31 AM GMT
వీడియో: విమానాశ్ర‌యంలో కెమెరాకు చిక్కిన బ్రొమాన్స్
X

ఎస్.ఎస్ రాజమౌళి RRR దేశీయంగా అంతర్జాతీయంగా గొప్ప విజ‌యాల్ని అందుకుంది. రామ్ చరణ్ - జూ.ఎన్టీఆర్ మధ్య ఆన్-స్క్రీన్ బ్రోమాన్స్ ఈ సినిమా విజయానికి ప్ర‌ధాన‌ కారణం అయితే, సినిమాలో వారి కెమిస్ట్రీ గొప్ప‌గా వ‌ర్క‌వుటైంద‌ని.. దీనికి కారణం నిజ జీవితంలో ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన ప్రేమ, స్నేహం అని కూడా చెప్పుకున్నారు.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌హా ప్ర‌చారంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ న‌డుమ అనుబంధం గురించి అభిమానులు ఎంతో చ‌ర్చించుకున్నారు. అప్ప‌ట్లోనే రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని, జూ.ఎన్టీఆర్ లైవ్ మ్యూజిక్ వైబ్స్‌తో విలాసవంతమైన పుట్టినరోజు పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలోను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ - రాజమౌళి మధ్య సాన్నిహిత్యం సహృదయత అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల.. జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి మ‌ధ్య గొప్ప స్నేహానుబంధం పెరిగింది. ఇటీవ‌ల RRR సీక్వెల్ కోసం ఎన్టీఆర్- రామ్ చరణ్ మళ్లీ కలుస్తార‌ని కూడా ప్ర‌చారం ఉంది.

ఇదిలా ఉండ‌గానే చాలా గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ క‌లిసి ప్ర‌యాణిస్తున్న ఓ వీడియో ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఇంత‌కీ ఈ స్నేహితులు ఇద్ద‌రూ ఎక్క‌డికి వెళుతున్నారు? అన్న‌ది ఆరా తీస్తే... అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల‌ కోసం జామ్‌నగర్ చేరుకోవ‌డానికి విమాన‌యానం చేసార‌ని తెలిసింది. ఈ వేడుక‌కు వెళుతున్న క్ర‌మంలో విమానాశ్ర‌యంలో ఇలా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బ్రొమాన్స్ మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. తార‌క్ వైట్ ష‌ర్ట్ జీన్స్ ధ‌రించి పూర్తి ప్లెయిన్ లుక్ లో క‌నిపించ‌గా, రామ్ చ‌ర‌ణ్ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ లో క‌నిపించాడు. అత‌డు బ్లాక్ లెద‌ర్ జాకెట్ ని ధ‌రించి స్టైలిష్ గా క‌నిపించాడు. చ‌ర‌ణ్‌తో పాటు ఒక వీడియోలో స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల కూడా క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో చ‌ర‌ణ్‌, తార‌క్ అభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహించిన‌ `గేమ్ ఛేంజర్` విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. `గేమ్ ఛేంజర్` తర్వాత రామ్ చరణ్ తదుపరి RC16 లో కనిపించనున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహించ‌నున్నారు.

Jr.NTR త‌దుప‌రి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న‌ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `దేవర: పార్ట్ 1`లో కనిపించనున్నారు. సూపర్‌హిట్ మూవీ `జనతా గ్యారేజ్` కోసం ఆ ఇద్ద‌రూ ఇంత‌కుముందు క‌లిసి ప‌ని చేసారు. దేవర లో జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అనిరుధ్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.