రామ్+బోయ.. బుల్లితెరపై బ్లాస్టింగ్
ఉదాహరణకు తీసుకుంటే మహేష్ బాబు నటించిన ఖలేజా థియేటర్స్ లో ప్లాప్ అయింది కానీ టీవీల్లోనూ, యూట్యూబ్ లో ఈ సినిమాని ఆడియన్స్ ఎగబడి చూస్తుంటారు.
By: Tupaki Desk | 9 Feb 2024 11:24 AM GMTసినిమాల పట్ల ఆడియన్స్ రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. థియేటర్లో డిజాస్టర్ అయిన సినిమాల్ని టీవీల్లో టెలికాస్ట్ చేసినప్పుడు మాత్రం ఎగబడి మరీ చూస్తుంటారు. అదే హిట్ అయిన సినిమాలు టీవీ లో వస్తే పెద్దగా ఆదరణ ఉండదు. ఉదాహరణకు తీసుకుంటే మహేష్ బాబు నటించిన ఖలేజా థియేటర్స్ లో ప్లాప్ అయింది కానీ టీవీల్లోనూ, యూట్యూబ్ లో ఈ సినిమాని ఆడియన్స్ ఎగబడి చూస్తుంటారు.
ఖలేజా ఒక్కటే కాదు ఇలాంటి కోవలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా ఉస్తాద్ హీరో రామ్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన 'స్కంద' సినిమా థియేటర్లో ప్లాప్ అయింది. ఈ సినిమాలో రామ్ ఊరమాసు గెటప్ లో కనిపించారు. డ్యూయెల్ రోల్ చేశారు. 2023లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.
రివ్యూలు కూడా మిశ్రమంగా రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీలో రామ్ పోతినేని సరసన శ్రీలీలా హీరోయిన్ గా నటించగా, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రలో కనిపించింది. థియేటర్లో ప్లాప్ అయిన ఈ సినిమాని తాజాగా టీవీలో టెలికాస్ట్ చేస్తే మాత్రం బ్లాక్ బస్టర్ రిజల్ట్ వచ్చింది. టీవీలో స్కంద సినిమాకి ఏకంగా 8.47 TRP రేటింగ్ వచ్చింది.
ఒక ప్లాప్ సినిమాకి ఈ రేంజ్ రేటింగ్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఈ సినిమాతో రామ్ క్రేజ్ ఏంటో మరోసారి రుజువయింది. దీనికి తోడు బోయపాటి సినిమాలకు టీవీల్లో భారీ ఆదరణ ఉంటుంది. ఆయన గత సినిమాలైన జయ జానకి నాయక(14.6), వినయ విధేయ రామ(7.9), అఖండ(10.47) రేటింగ్స్ తో అదరగొట్టాయి. రామ్ గత సినిమాలకు కూడా బుల్లితెరపై మంచి టిఆర్పి రేటింగ్ అందుకున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ సినిమాకి టీవీల్లో 14.44 రేటింగ్స్ వస్తే, ది వారియర్ లాంటి డిజాస్టర్ మూవీ 10 కి పైగా రేటింగ్స్ రావడం విశేషం. దీన్నిబట్టి బుల్లితెరపై రామ్ సినిమాలకి ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో నటిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.