2 సార్లు మిస్సయ్యింది.. ఈసారి వదలని చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్
By: Tupaki Desk | 17 July 2023 9:41 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత వెంట వెంటనే స్పీడ్ గా సినిమాలు చేయాలని అనుకున్నాడు. అయితే అనుకోకుండా చేసిన ఆచార్య ప్రాజెక్టు కొంత నిరాశపరిచింది. ఇప్పుడు శంకర్ సినిమాను అయినా వీలైనంత త్వరగా ఫినిష్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలి అని అనుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు మాత్రం ఊహించిన విధంగా ఆలస్యం అవుతోంది.
మరోవైపు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 ప్రాజెక్టుతో బిజీగా ఉండడం వలన ఇప్పుడు గేమ్ చెంజర్ రోజురోజుకు మరింత ఆలస్యం అవుతుంది. ఇంకా ఇటీవల మొత్తానికి ఒక షెడ్యూల్ అయితే సెట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాను మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటివరకు షూటింగ్ పూర్తయ్య అవకాశం కనిపించడం లేదు.
దీంతో నిర్మాత దిల్ రాజు సమ్మర్ చివరలోనే ఈ సినిమాను విడుదల చేయాలి అని అనుకుంటున్నాడు. అయితే మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సినిమాను ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇక ఆ ప్రాజెక్టుతో రాంచరణ్ తన చిరకాల కోరికను నెరవేర్చుకోబోతున్నాడు. ఎందుకంటే ఆ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతోంది. చరణ్ అలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలంటే చాలా ఇష్టం.
ఇదివరకే రెండుసార్లు రాంచరణ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయాలని అనుకున్నప్పుడు. అవి అనుకోకుండా క్యాన్సిల్ అయ్యాయి. మొదట అప్పట్లో మెరుపు అనే ఒక సినిమా టైటిల్ తో రామ్ చరణ్ ఒక ప్రాజెక్ట్ ను లైక్ లోకి తెచ్చాడు. ఆ సినిమాకు తమిళ దర్శకుడు ధరణిని కూడా అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు స్క్రిప్టు సరిగ్గా సెట్ కాకపోవడంతో చరణ్ వెనుకడుగు వేశాడు.
మళ్ళీ గత ఏడాది గౌతమ్ తిన్నానూరితో కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు కూడా స్క్రిప్ట్ విషయంలో నమ్మకం కలగకపోవడంతో క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది.
అయితే ఎలాంటి స్పోర్ట్ అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ గతంలో అయితే కొక్కో కబడ్డీ బ్యాక్ గ్రౌండ్ లో దర్శకుడు కథను సెట్ చేసుకున్నట్లుగా టాక్ వినిపించింది. ఇక మొత్తానికి చరణ్ ఒక స్పోర్ట్స్ కథతో అయితే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.