Begin typing your search above and press return to search.

₹10K వాచ్‌ తోనే చరణ్‌ ఫుల్‌ తృప్తి

పదుల కొద్ది వాచ్ ల కలెక్షన్‌ ఉన్న రామ్ చరణ్

By:  Tupaki Desk   |   24 July 2023 7:55 AM GMT
₹10K వాచ్‌ తోనే చరణ్‌ ఫుల్‌ తృప్తి
X

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోలు మొదలుకు చిన్న చిన్న సెలబ్రెటీల వరకు అత్యంత ఖరీదైన వాచ్‌ లను వినియోగిస్తూ ఉన్నారు. ఆ మధ్య ఈ హీరో వాచ్ ఖరీదు కోటి రూపాయలు అయితే.. ఆ హీరో వాచ్‌ ఖరీదు రెండు కోట్లు అన్నట్లుగా మీడియాలో.. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. ఇంకా కూడా ఆ ప్రచారం కొనసాగుతూనే ఉంది.

రామ్ చరణ్‌ వద్ద లక్షలు.. కోట్ల విలువ చేసే ఎన్నో వాచ్ లు ఉన్నాయి. పదుల కొద్ది వాచ్ ల కలెక్షన్‌ ఉన్న రామ్ చరణ్ ఇటీవల వాచ్ ల సేకరణ ఆపేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. తన వద్ద ఉన్న గొప్ప గొప్ప వాచ్ లతో పోల్చితే కరోనా సమయంలో కొనుగోలు చేసిన రూ.10 వేల స్టెయిన్ లెస్‌ స్టీల్‌ క్యాషియో వాచ్ తో చాలా సంతోషంగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు.

లగ్జరీ వాచ్ ను కొనుగోలు చేసిన సమయంలో కంటే కూడా ఈ పది వేల రూపాయల వాచ్ ను కొనుగోలు చేసిన సమయంలో చాలా సంతృప్తి కలిగిందని సన్నిహితుల వద్ద పేర్కొన్నాడట. చాలా మంది హీరోలు... సెలబ్రెటీలు లక్షలు.. కోట్లు ఖరీదు ఉండే వాచ్ లను కొనుగోలు చేస్తున్న సమయంలో చరణ్ పది వేల రూపాయల వాచ్ పై తన ప్రేమను వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్‌ మాత్రమే కాకుండా ఈ మధ్య అల్లు అర్జున్‌ కూడా ఖరీదైన వాచ్ కాకుండా స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ క్యాషియో వాచ్ లను ధరించి కనిపిస్తున్నాడు. ఇటీవల ఒక కార్యక్రమం సందర్భంగా బన్నీ ఆ తరహా వాచ్ ను ధరించి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

రామ్ చరణ్‌ దారిలో ముందు ముందు మరింత మంది హీరోలు.. సెలబ్రెటీలు అడుగు లు వేసి అనవసరంగా వాచ్ లకు లక్షలు.. కోట్లు ఖర్చు పెట్టడం మానేస్తారని అంతా భావిస్తున్నారు. ఇక రామ్‌ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాను చేస్తున్నాడు. మరో వైపు బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది.