చరణ్ ఫ్యాషన్ టిప్స్.. ఆ కలర్ చాలా స్పెషల్..!
రాం చరణ్ టాలీవుడ్ సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా తన స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటాడు
By: Tupaki Desk | 1 Aug 2023 3:41 AM GMTగ్లోబల్ స్టార్ రాం చరణ్ టాలీవుడ్ సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా తన స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటాడు. ఫ్యాషన్ ని ఫాలో అయ్యే అతి తక్కువ మంది హీరోల్లో చరణ్ ఒకరు. ఒకప్పుడు ఫ్యాషన్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య తక్కువ కానీ ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వారిలో చరణ్ కి వెరైటీ ఫ్యాషన్స్ పై మంచి టేస్ట్ ఉంది. భారీగా కనిపించకపోయినా లేటెస్ట్ ట్రెండ్ కి తగినట్టుగా ఫ్యాషన్ ని ఫాలో అవుతుంటారు చరణ్. చరణ్ ఫాలో అయ్యే ఫ్యాషన్స్ లో తనకు ఇష్టమైనది ఏంటి.. ఫ్యాన్స్ కి ఈ విషయంలో చరణ్ ఇచ్చే సలహాలు ఏంటని తెలుసుకోవాలని అనుకుంటారు.
లేటెస్ట్ గా తన ఫ్యాషన్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ లను బయట పెట్టాడు చరణ్. చరణ్ కి ఇష్టమైన కలర్స్ ఏంటి అంటే బ్లాక్, వైట్, గ్రే అని చెప్పారు. ఈ 3 కలర్స్ తో తప్పనిసరిగా డ్రెస్ లు ఉండాలని చెబుతున్నారు. వార్డ్ రోబ్ లో బ్లాక్, వైట్, గ్రే కలర్ డ్రెస్ లు కంపల్సరీగా ఉండాలని అంటున్నారు చరణ్. ఎలాంటి సందర్భంలో అయినా ఈ కలర్ డ్రెస్ లు వేసుకునేందుకు చాలా కంఫర్ట్ గా ఉంటానని అన్నారు చరణ్. బీరువాలో బ్లాక్ షర్ట్ లేదా టీ షర్ట్, వైట్ షర్ట్, బ్లాక్ టీ షర్ట్ ఇవి కంపల్సరీగా ఉండాలి. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ రెండు కలర్స్ ఉండాలని అంటున్నారు చరణ్.
పెద్ద స్టార్ నుంచి చాలామంది సెలబ్రిటీలు కూడా బ్లాక్ ని ఇష్టపడతారని.. బ్లాక్ కలర్ కి ఎట్రాక్ట్ చేసే గుణం ఉంటుందని.. పార్టీల్లో బ్లాక్ కలర్ డ్రెస్ వేస్తే తిరుగు ఉండదు అన్నారు చరణ్. నైట్ పార్టీల్లో బ్లాక్ డ్రెస్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుందని.. మన లోపాలన్నిటిని బ్లాక్ కలర్ కవర్ చేస్తుందని.. అందుకే చాలామంది బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకునేందుకు ఇష్టపడతారని అన్నారు.
ఇక డ్రెస్ తర్వాత చరణ్ రిస్ట్ వాచ్ ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారట. వాచ్ ల కోసం కూడా ఎక్కువ ఖర్చు పెడతారని చెప్పారు. ఇక అతి తక్కువ ఖర్చు చెప్పులపై చేస్తారట. బాలీవుడ్ హీరోల్లో సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్స్ లో దీపికా పదుకొనే ఫ్యాషన్ స్టయిల్స్ ఇష్టమని అన్నారు చరణ్. ఇక చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.