మహేష్ బెస్ట్ ఆప్షన్ అంటున్న చరణ్..!
మెగా నందమూరి ఈ కాంబో అంటేనే ఫ్యాన్స్ కి పండగే అది సినిమా అయినా షో అయినా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది.
By: Tupaki Desk | 9 Jan 2025 10:39 AM ISTనందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా OTTలో అదరగొట్టేస్తున్న స్పెషల్ చిట్ చాట్ షో అన్ స్టాపబుల్. బాలయ్యలోని ఫన్ యాంగిల్ ని ప్రేక్షకులకు తెలిసేలా చేసిన ఈ షో ఇప్పటికే 3 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని నాలుగో సీజన్ దాకా వచ్చింది. ఈ 4వ సీజన్ లో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ వచ్చి షోలో పాల్గొన్నారు. ఈమధ్యనే విక్టరీ వెంకటేష్ కూడా అన్ స్టాపబుల్ బాలయ్యతో అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వెళ్లారు.
ఇక లేటెస్ట్ గా ఈ షోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అటెండ్ అయ్యారు. మెగా నందమూరి ఈ కాంబో అంటేనే ఫ్యాన్స్ కి పండగే అది సినిమా అయినా షో అయినా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో చరణ్ పాల్గొనడం మెగా నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ గా వస్తుండగ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షోకి వచ్చాడు రాం చరణ్.
బాలయ్య షోకి వస్తే బంతాట ఆడిస్తాడు. అవతల ఉన్న సెలబ్రిటీ ఎవరైనా సరే బాలయ్య అడిగింది చెప్పాల్సిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ని కూడా బాలకృష్ణ సరదాగా ఆట పట్టించారు. ఇక ప్రభాస్, మహేష్ ఇద్దరిలో ఎవరితో మల్టీస్టారర్ చేస్తావని అని బాలయ్య అడిగారు. దానికి ముగ్గురు కలిసి మల్టీస్టారర్ చేస్తామని అనగా ఎవరో ఒక్కరి పేరే చెప్పాలంటే ప్రభాస్ అర్ధం చేసుకుంటాడు మహేష్ నా కన్న సీనియర్ కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ ఇస్తూ మహేష్ తోనే సినిమా చేస్తానని అన్నాడు రామ్ చరణ్.
ప్రభాస్ ఇష్టం మహేష్ అంటే భయం అనగా దాన్ని కోట్ చేస్తూ మహేష్ అంటే ఇష్టం లేదన్న చరణ్ అంటూ బాలకృష్ణ ఆట పట్టించారు. ఇక తన ఇంట్లో అక్క అంటే ఇష్టమని.. ఉపాసన అంటే భయం ఉన్నట్టు నటిస్తానని అన్నాడు రామ్ చరణ్. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి కొత్తలో బాలకృష్ణ గారు తమ పిల్లలతో తనని డిన్నర్ కి తీసుకెళ్లిన విషయాన్ని చెప్పి బాలయ్యకు సర్ ప్రైజ్ ఇచ్చాడు రాం చరణ్. ఇలా మెగా హీరో రాం చరణ్ తో నందమూరి నట సింహం బాలకృష్ణ చేసిన ఈ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆడియన్స్ కు సూపర్ ట్రీట్ ఇస్తుంది.