డిజాస్టర్ హీరోతో చరణ్.. మల్టీస్టారర్ కాదుగా?
RRR సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ కు బాలీవుడ్ మార్కెట్లో కూడా మంచి క్రేజ్ వచ్చినట్లు అనిపించింది.
By: Tupaki Desk | 21 March 2025 12:25 PM ISTRRR సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ కు బాలీవుడ్ మార్కెట్లో కూడా మంచి క్రేజ్ వచ్చినట్లు అనిపించింది. అయితే ఆ ఊపు కొద్దిగా తగ్గింది. గేమ్ ఛేంజర్ హిందీతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసినా, అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్స్ట్ సినిమాగా బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 రూపొందుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై ఓ హైప్ ఏర్పడింది.
ఇకపోతే RC17 సుకుమార్ డైరెక్షన్ లో రూపొందనుండటం మరో హైలెట్. పుష్ప 2తో బాలీవుడ్ లో సుకుమార్ హైప్ ఉన్నందున ఈ కాంబోపై నార్త్ ఆడియన్స్ లోనూ ఆసక్తి పెరుగనుంది. అయితే లేటెస్ట్ గా రామ్ చరణ్ ఒక బాలీవుడ్ చిత్ర సెట్స్ దగ్గర కనిపించడంతో అభిమానుల్లో సందిగ్ధత మొదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామెడీ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతుండగా.. అక్కడ చరణ్ ఫోటో వైరల్ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ప్రియదర్శన్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు చరణ్‌ను కవర్ చేస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో చరణ్ అక్కడ షూటింగ్ కోసమేనా గెస్ట్ గానే వచ్చారా? లేక ఏదైనా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక అక్షయ్ కుమార్ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ఇప్పటివరకు పెద్దసంఖ్యలో సినిమాలు చేసినా, ఇటీవల కాలంలో అతనికి సక్సెస్ దక్కడం లేదు. ఇటీవల వరుసగా విడుదలైన అతని సినిమాల కలెక్షన్స్ కనీసం రెమ్యునరేషన్ నెంబర్ కు దగ్గరగా రాలేకపోయాయి.
ఈ నేపథ్యంలో అక్షయ్ సినిమాతో చరణ్ కనిపించడంతో మెగా అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. “మల్టీస్టారర్ కాదుగా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే చరణ్ బహుశా అక్కడ పక్కనే షూటింగ్ ఉండడంతో సెట్స్‌కి వెళ్లి ప్రియదర్శన్‌ని కలిసే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రియదర్శన్‌కు సౌత్‌లో చాలా మంది టాప్ హీరోలతో సంబంధాలు ఉన్నాయి.
గతంలో కూడా అతను పలు దక్షిణాది సినిమాలు రూపొందించారు. అలా చూస్తే, రామ్ చరణ్‌ను కూడా ఓ మంచి కథతో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారా?అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కానీ ఈ పుకార్లపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇప్పటికైతే భూత్ బంగ్లా సినిమాలో రామ్ చరణ్ క్యామియో లేదా స్పెషల్ అపీర్ చేస్తారా అనే విషయంలో క్లారిటీ లేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలాంటి అప్డేట్ ఇస్తారో.