చరణ్ బర్త్ డే ..ఇంత స్పెషల్‌గా మార్చింది ఎవరో తెలుసా?
మార్చి 27 నాటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి 40 ఏళ్లు నిండాయి. ఈ బర్త్ డే ని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేయడానికి అతడి భార్య ఉపాసన కొణిదెల ప్లాన్ చేసారు.
By: Tupaki Desk | 29 March 2025 8:00 AMమార్చి 27 నాటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి 40 ఏళ్లు నిండాయి. ఈ బర్త్ డే ని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేయడానికి అతడి భార్య ఉపాసన కొణిదెల ప్లాన్ చేసారు. ఈ ప్లాన్ బాగా వర్కవుటైంది. హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో అత్యంత వైభవంగా ఈవెంట్ ని ప్లాన్ చేసిన ఉపాసన చెర్రీకి స్పెషల్ ట్రీట్ ఇచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక వేడుకను జరుపుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ వేడుకకు అతికొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. వారిలో దగ్గుబాటి రానా, లక్ష్మి మంచు కూడా ఉన్నారు. లక్ష్మీ మంచు తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో పార్టీ నుండి ప్రత్యేకమైన ఇన్‌సైడ్ గ్లింప్స్‌ను షేర్ చేసారు. గ్లోబల్ స్టార్, స్పెషల్ బర్త్‌డే ఎడిషన్ అనే పదాలను లక్ష్మీ దీనికి జోడించడం ఆసక్తిని కలిగించింది.
కొద్దిరోజులుగా చరణ్ బర్త్ డే వేడుకల నుంచి గ్లింప్స్ వైరల్ అవుతుండగా, వీటిలో ఫలక్ నుమా ప్యాలెస్ మీద తేజోవంతమైన బాణసంచా ప్రదర్శన ఆకర్షించింది. హైదరాబాద్ ని ఈ బాణసంచా కాంతిమయం చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి.
రామ్ చరణ్ 40వ పుట్టినరోజు కేవలం ఒక పార్టీ కాదు. అది ఒక అనుభవం! ఇంత విలాసవంతమైన .. హార్ట్ టచింగ్ వేడుకతో ఉపాసన ప్రతి మూవ్ మెంట్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇక ఉపాసన ప్రతి బర్త్ డేకి ఎగ్జోటిక్ లొకేషన్ లో విహారయాత్రలను ప్లాన్ చేయడం ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా మార్చడం రామ్ చరణ్ ప్రత్యేకత. గతంలో దక్షిణాఫ్రికాలోని వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.