గేమ్ ఛేంజర్.. చరణ్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే?
అదే సమయంలో రామ్ చరణ్.. రీసెంట్ గా బిగ్ బాస్-8 తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 Dec 2024 7:55 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ తో సందడి చేసేందుకు మేకర్స్ సిద్ధమవ్వగా.. ఆడియన్స్ కూడా అంతే ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో రామ్ చరణ్.. రీసెంట్ గా బిగ్ బాస్-8 తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో గేమ్ ఛేంజర్ మూవీ గురించి మాట్లాడారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుని సినిమాపై అంచనాలు పెంచారు. గేమ్ ఛేంజర్ శంకర్ పాత సూపర్ హిట్ చిత్రాల స్క్రీన్ ప్లే గుర్తు చేస్తుందని తెలిపారు. అందులో ఆయన మాస్టర్ అని కొనియాడారు. మాస్ పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ అని తెలిపారు.
తాను సినిమాలో తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్లు రివీల్ చేశారు. శంకర్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమని రామ్ చరణ్ తెలిపారు. గేమ్ ఛేంజర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణమేంటని నాగార్జున అడగ్గా.. స్వయంగా శంకర్ నుంచి కాల్ రావడం తాను ఈ సినిమా చేయడానికి ఒక కారణమని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ మూవీ చివరి షెడ్యూల్ జరుగుతున్న సమయంలో తనకు గేమ్ ఛేంజర్ ఛాన్స్ వచ్చిందని తెలిపారు. రాజమౌళి, శంకర్ లతో కలిసి పనిచేయడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి గోల్డెన్ ఛాన్సులు అస్సలు మిస్ చేసుకోకూడదని ఫిక్స్ అయినట్లు తెలిపారు. గేమ్ ఛేంజర్ అందరినీ మెప్పిస్తుందని అన్నారు.
ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికొస్తే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగమ్మాయి అంజలి మరో లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. శ్రీకాంత్, ఎస్ జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి జనవరి 10వ తేదీన రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ .. ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.