పెద్ది.. పుష్పతో పోలికలా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన RC16 ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 27 March 2025 5:13 PMమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన RC16 ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌తో వస్తుండటం కాస్త ఊహించని విషయమే. రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ ఓ సిగరెట్ వెలిగిస్తూ సీరియస్ మూడ్‌లో కనిపించడం పోస్టర్‌ను మాస్‌కి మరింత దగ్గర చేసింది. కానీ దీనికి తోడు, ఆ లుక్ స్టైల్‌తో పాటు పోస్టర్ టోన్ కూడా పుష్ప సినిమా స్టైల్‌ను గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్‌లోని మేకోవర్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టింగ్‌గా నిలిచింది. దీంతో 'పెద్ది' పోస్టర్‌లో చరణ్ లుక్ చూసి అదే మాస్ ఫ్లేవర్ ఉందంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. దాదాపు గురువు సుకుమార్ తరహాలోనే బుచ్చి బాబు సినిమా కూడా రఫ్ అండ్ రగ్డ్ హీరోగా చూపించబోతున్నాడా అనే ఉత్కంఠ పెరుగుతోంది.
అయితే కథ పరంగా ‘పెద్ది’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా. పుష్పలా స్మగ్లింగ్ నేపథ్యంలో కధనం సాగదు. కానీ పోస్టర్‌లో ఉన్న ఇంటెన్సిటీ, మాస్ ప్రెజెంటేషన్, హీరో వేరియేషన్ వంటివి పుష్పతో పోలికలు తలెత్తించాయి. ఇది పూర్తిగా కథ కంటే మేకింగ్ ప్రెజెంటేషన్ పరంగానే ఫ్యాన్స్ రియాక్షన్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అంతేకాదు, బుచ్చిబాబు చెప్పినట్లుగా ఇది స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సినిమా కానుంది.
‘ఉప్పెన’ సినిమాతోనే తన మార్క్ చూపించిన బుచ్చిబాబు.. ఈసారి ఒక పెద్ద లీగ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రామ్ చరణ్ కెరీర్‌లో పూర్తిగా కొత్త షేడ్‌గా కనిపించబోయే ఈ పాత్ర కోసం ఆయన పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. ఈ ఒక్క పోస్టర్‌తోనే క్రేజ్ పెరిగిపోవడాన్ని బట్టి, సినిమాలో ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో అర్థమవుతోంది.
ఇక ‘పెద్ది’ గురించి వస్తున్న అంచనాలు, పోలికలే కాదు.. సినిమాలో ఎవరు విలన్? హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారు? అనే విషయాల మీద కూడా చర్చలు మొదలయ్యాయి. త్వరలోనే మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ వచ్చేస్తాయన్న ప్రచారం ఉంది. ఎప్పుడూ లవర్ బాయ్, మాస్ హీరోగా కనిపించే చరణ్ ఈసారి తేడా చూపించనున్నాడు. ఒకవేళ ‘పెద్ది’ అంచనాలను అందుకున్నట్లయితే, ఇది మాస్ స్పోర్ట్స్ డ్రామాలకు కొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందనే మాట స్పష్టంగా వినిపిస్తోంది. మొత్తానికి.. చరణ్ కొత్త రూపం నెట్టింట హంగామా చేస్తోంది. ఇది పుష్పకు పోటీనా? లేక తనకంటూ ఓ కొత్త స్థాయిలో నిలిచే ప్రయత్నమా? అన్నది మాత్రం తేలాలంటే సినిమా థియేటర్స్‌లోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.