Begin typing your search above and press return to search.

RC16 : చరణ్‌ కి తండ్రైతే నో...!

రామ్‌ చరణ్‌, బుచ్చి బాబు కాంబినేషన్ లో సినిమా కోసం జరుగుతున్న స్క్రిప్ట్‌ వర్క్ ముగింపు దశకు చేరుకుంది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 7:30 PM GMT
RC16 : చరణ్‌ కి తండ్రైతే నో...!
X

రామ్‌ చరణ్‌, బుచ్చి బాబు కాంబినేషన్ లో సినిమా కోసం జరుగుతున్న స్క్రిప్ట్‌ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ తర్వాత బుచ్చిబాబు తో చరణ్‌ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్‌ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించబోతుంది. ఇప్పటికే దేవర సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు కోసం ఎదురు చూస్తున్న జాన్వీ కపూర్‌ మరో వైపు చరణ్‌ తో కెమెరా ముందుకు వెళ్లేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

దర్శకుడు బుచ్చి బాబు మొదటి సినిమా ఉప్పెనలో తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించాడు. ఆయన పాత్ర వల్లే సినిమా సూపర్‌ హిట్‌ అనే అభిప్రాయం చాలా మంది ఉంది. అందుకే బుచ్చిబాబు మరోసారి ఆయనతో వర్క్‌ చేయాలని ఆశ పడ్డాడు. అందుకోసం చాలా ఆసక్తికర పాత్రను విజయ్ సేతుపతికి బుచ్చిబాబు ఆఫర్‌ చేశాడని సమాచారం అందుతోంది. అయితే విజయ్ సేతుపతి ఆ ఆఫర్‌ ను ఎంత పారితోషికం ఇచ్చినా కూడా అంగీకరించలేను అంటూ సున్నితంగా తిరస్కరించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

చరణ్, బుచ్చిబాబు కాంబో మూవీ ని తిరస్కరించడం పై విజయ్‌ సేతుపతిని సంప్రదించిన సమయంలో స్పందిస్తూ.. నాకు బుచ్చిబాబు కథ అంతా చెప్పారు. కచ్చితంగా చరణ్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా సర్‌ప్రైజ్‌ అయ్యే విధంగా సినిమా ఉంటుంది అన్నాడు. అయితే సినిమాలో నటించాలని అడిగినప్పుడు చరణ్‌ కు తండ్రి పాత్ర లో అయితే నటించలేను అంటూ తేల్చి చెప్పాను. ప్రస్తుత సమయంలో హీరోలకు తండ్రి పాత్రలు చేయడం వల్ల కెరీర్‌ లో ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది అనే ఉద్దేశ్యంతో విజయ్ సేతుపతి ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

విజయ్‌ సేతుపతి మహారాజా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రిలీజ్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓటీటీ స్ట్రీమింగ్‌ లో పాతిక దేశాల్లో టాప్ లో నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూసిన ఇండియన్ మూవీగా కూడా మహారాజా సినిమా నిలిచింది. అలాంటి హిట్స్ ను సొంతం చేసుకున్న విజయ్‌ సేతుపతి మరిన్నిలీడ్‌ రోల్స్ ఉన్న సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. అందుకే చరణ్ సినిమాను సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.