STD18: మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్
డిసెంబర్ 12న, యూసుఫ్ గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో “కార్నేజ్ ఆఫ్ SDT18” అనే రెండవ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
By: Tupaki Desk | 9 Dec 2024 6:48 AM GMTసాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాలంలో రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. విరుపాక్ష సిమిమా ఏ స్థాయిలో విజయాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆ సినిమా అతని మార్కెట్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఇక నెక్స్ట్ పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునేందుకు సిద్దమవుతున్నాడు. మొదటిసారి భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రం SDT18 ఇప్పుడు టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవల విడుదల చేసిన “ఇంట్రూడ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ గ్లింప్స్ చూసిన వెంటనే ప్రేక్షకులు, సినీ ప్రముఖులు సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్‌డేట్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 12న, యూసుఫ్ గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో “కార్నేజ్ ఆఫ్ SDT18” అనే రెండవ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. ఈ అప్డేట్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. రామ్ చరణ్ లాంటి ప్రముఖ నటుడు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన స్టార్ ఈ ఈవెంట్ కు హాజరుకావడం వల్ల ఈ చిత్రానికి మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. ఈ సినిమాను హనుమాన్ ఫేం నిరంజన్ రెడ్డి - చైతన్య రెడ్డి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక పాన్-ఇండియా స్థాయి హై-విజువల్స్ తో పాటు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఈ సినిమా తెరపైకి రానుంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ కథానాయికగా కనిపించనున్నారు. సినిమా కథ, విజువల్స్ మీద నిర్మాతలు, దర్శకుడు చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, సినిమా లోని విజువల్ గ్రాండియర్ గా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. అలాగే సాయిధరమ్ తేజ్ యొక్క విభిన్న పాత్రపై మంచి హైప్ క్రియేట్ చేయనున్నట్లు మేకర్స్ ఒక నమ్మకాన్ని కలిగించారు.
ఇప్పుడు విడుదల చేయనున్న “కార్నేజ్ ఆఫ్ SDT18” గ్లింప్స్ మరింత బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన ప్రధానమైన యాక్షన్ సీక్వెన్సెస్, కథ ఆధారంగా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా, హిందీ, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా విడుదలకానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా మార్కెట్ ను మరింత విస్తరించడానికి SDT18 ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా హై రేంజ్ లో జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.