Begin typing your search above and press return to search.

రామ్ చ‌రణ్-ఉపాస‌న ఆస్తుల రేంజ్?

టాలీవుడ్ లో అగ్ర క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా, బిజినెస్‌మేన్ గా నాలుగు చేతులా ఆర్జిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్‌.

By:  Tupaki Desk   |   15 Dec 2024 3:00 AM GMT
రామ్ చ‌రణ్-ఉపాస‌న ఆస్తుల రేంజ్?
X

టాలీవుడ్ లో అగ్ర క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా, బిజినెస్‌మేన్ గా నాలుగు చేతులా ఆర్జిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో పాన్ ఇండియ‌న్ స్టార్‌గా 100 కోట్ల పారితోషికం అందుకునే రేంజుకు ఎదిగాడు. మ‌రోవైపు అత‌డు ర‌కర‌కాల లాభ‌సాటి వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టాడు. చ‌ర‌ణ్ సొంతంగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ బ్యాన‌ర్ స్థాపించి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. క్రీడారంగంలోను అత‌డు తెలివిగా పెట్టుబ‌డులు పెడుతున్నాడు. అలాగే కొన్ని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల్లోను పెట్టుబ‌డి పెట్టాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. విమాన‌యాన రంగం ట్రూజెట్‌లో ఒక భాగ‌స్వామిగా చ‌ర‌ణ్ ఉన్నారు. గ‌ణాంకాల ప్ర‌కారం.. రామ్ చ‌ర‌ణ్ నిక‌ర ఆస్తి విలువ సుమారు 1370 కోట్లు ఉంటుందని గ‌తంలో ఫోర్బ్స్ సైతం క‌థ‌నం ప్ర‌చురించింది.

త‌న భార్య ఉపాస‌న కామినేని ఆస్తుల‌తో సంబంధం లేకుండా చ‌ర‌ణ్ ఆస్తి విలువ ఇది. అయితే ఉపాస‌న ఆస్తులను కూడా క‌లుపుకుంటే చెర్రోపాస‌న (చెర్రీ+ఉపాస‌న‌) నిక‌ర ఆస్తి విలువ ఎంత ఉంటుంది? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అలాంటి వారికి మ‌రింత స్ప‌ష్ఠ‌త రావ‌లంటే... ఉపాస‌న కొణిదెల అపోలో సంస్థానంలో ఏం చేస్తుందో ఒక ఐడియా రావాలి. ఉపాస‌న అపోలో సంస్థ‌ల్లో మేనేజింగ్ డైరెక్ట‌ర్ హోదాలో ప‌ని చేస్తున్నారు. అపోలో హెల్త్ మ్యాగ‌జైన్ నిర్వాహ‌కురాలు. అపోలో లైఫ్ వెల్‌నెస్ చైన్ మొత్తం చూసుకునేది ఉపాస‌న‌. త‌ద్వారా ఉపాస‌నకు ద‌క్కే వాటా ప్ర‌కారం త‌న నిక‌ర ఆస్తుల విలువ సుమారు 1100 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఇద్ద‌రి ఆస్తుల‌ను క‌లుపుకుంటే సుమారు 2500 కోట్ల నిక‌ర విలువ‌ ఈ జంట‌కు ఉంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి నుంచి వ‌చ్చే వార‌స‌త్వ‌పు ఆస్తుల‌తో సంబంధం లేకుండానే, రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు తానుగానే ఎదుగుతున్నారు. ఒక స్టార్ గా రాణిస్తూనే, వ్యాపారాలను చ‌క్క‌బెట్టుకోవ‌డంలో అత‌డు స‌వ్య‌సాచిలా ప‌ని చేస్తున్నాడు. అందువ‌ల్ల‌నే ఈ ఆస్తుల విలువ అంత‌కంత‌కు పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం శంక‌ర్ - దిల్ రాజుతో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా 2025లో పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల కానుంది. ఈ మూవీ కోసం చ‌ర‌ణ్ సుమారు 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని క‌థ‌నాలొస్తున్నాయి.