16 ఇయర్స్ ఆఫ్ RC.. మెగా పవర్ టు గ్లోబల్ స్టార్..!
చిరుత నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు తన కెరీర్ గ్రాఫ్ చూస్తే మెగా వారసుడు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా హాలీవుడ్ లో కూడా సూపర్ క్ర్రేజ్ తెచ్చుకున్నాడు చరణ్.
By: Tupaki Desk | 28 Sep 2023 11:30 AM GMTచిరు తనయుడు మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగేట్రం చేసిన రాం చరణ్ మొదటి సినిమా చిరుతతోనే తన లోని ఈజ్ ని చూపించాడు. ఇక రెండో సినిమా మగధీర తోనే ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టిన చరణ్ అప్పటి నుంచి కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ సత్తా చాటుతూ వచ్చాడు. రంగస్థలం ముందు వరకు చిరంజీవి తనయుడు మెగా వారసుడు అనే ట్యాగ్ తోనే వినిపించిన చరణ్ రంగస్థలం సినిమాతో అసలు ఆట మొదలు పెట్టాడు.
కెరీర్ లో తనదైన పాత్ర పడితే ఏ నటుడైనా తన ఎవర్ బెస్ట్ అవుట్ పుట్ ఇస్తాడని చెప్పొచ్చు. అలా రంగస్థలం లో చిట్టి బాబు పాత్ర చరణ్ కి నటుడిగా కొత్త ఉత్సాహం అందించింది. రంగస్థలం నుంచి చరణ్ సినిమాలు చేసే విధానం ఫ్యాన్స్ అతన్ని చూసే విధానం రెండు మారాయి. ఇక RRR సినిమాలో సీతారామరాజుగా అదరగొట్టేశాడు రాం చరణ్.
చిరుత నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు తన కెరీర్ గ్రాఫ్ చూస్తే మెగా వారసుడు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా హాలీవుడ్ లో కూడా సూపర్ క్ర్రేజ్ తెచ్చుకున్నాడు చరణ్. సరిగ్గా 16 ఏళ్ల క్రితం అంటే 2007 సెప్టెంబర్ 28న చిరుత సినిమాతో రాం చరణ్ తెరంగేట్రం జరిగింది. ఈ 16 ఏళ్లలో హీరోగా తన కెపాసిటీ.. నటుడిగా తన విశ్వరూపాన్ని.. మనిషిగా తన మంచి తనాన్ని చూపిస్తూ అసలు సిసలైన మెగా వారసుడిగా చరణ్ ఒక అద్భుతమైన శక్తిగా నిలిచాడు.
16 ఏళ్ల కెరీర్ లో ఎన్నో అద్భుతాలు చేసిన చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న చరణ్ ఛాన్స్ వస్తే హాలీవుడ్ సినిమాలు చేసేందుకు రెడీ అంటున్నాడు. ఆల్రెడీ ఆ డిస్కషన్స్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 16 సక్సెస్ ఫుల్ ఇయర్స్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న చరణ్ గ్లోబల్ స్టార్ గా మునుముందు మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుందాం. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కూడా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నడు చరణ్.