అల్లు అరవింద్ కల నెరవేరేదెప్పుడో?
నేడు బన్నీ-చరణ్ పాన్ ఇండియా హీరోలు. గ్లోబల్ స్థాయిలో చరణ్ పేరిప్పుడు మారు మ్రోగిపోతుంది
By: Tupaki Desk | 3 April 2024 3:15 AM GMTనేడు బన్నీ-చరణ్ పాన్ ఇండియా హీరోలు. గ్లోబల్ స్థాయిలో చరణ్ పేరిప్పుడు మారు మ్రోగిపోతుంది. జాతీయ అవార్డు తర్వాత బన్నీ రేంజ్ అంతకంతకు రెట్టింపు అయింది. ఇద్దరు సోలోగా 1000 కోట్లు వసూళ్లు తేగల సత్తా ఉన్న నటులు. ఛాన్స్ ఇవ్వాలే గానీ ఇద్దర్నీ బాలీవుడ్ కి ఎగరేసుకుపోవాలని కరణ్ జోహార్ లాంటి వారు ప్లాన్ చేసారు.
మరి ఈ ఐడియా అల్లు అరవింద్ కి ఇంతవరకూ ఎందుకు రాలేదు? ఇద్దరితో సినిమా నిర్మించాలని ఆయనెందుకు అనుకోవడం లేదు? ఇద్దరు హీరోలగా ఓ భారీ మల్టీస్టారర్ చేసి పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే అది సంలచనమే కదా? మరి ఈ ఆలోచన అరవింద్ గారికి ఇంకా తట్టలేదంటారా? అంటే ఆయన్ని అంచనా వేయడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.
బన్నీ-చరణ్ తో సినిమా కలిపి సినిమా చేయాలని అరవింద్ వాళ్లిద్దరు హీరోలు కాకుండానే డిసైడ్ అయ్యారు అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆయన 'చరణ్ -అర్జున్' అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారు. దీన్ని అరవింద్ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. ఇంతవరకూ అరవింద్ కలల ప్రాజెక్ట్ ఏది అంటే అంతా 'రామాయణం' గురించి చెప్పేవారు. కానీ అంతకు మించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదని అరవింద్ మాటల్లో అర్దమవుతుంది. ఆ డ్రీమ్ నెరవేర్చుకునే అవకాశం..సమయం కూడా వచ్చేసాయని చెప్పొచ్చు.
వందలకోట్ట పెట్టుబడి పెట్టడం ఆయనకు పెద్ద విషయం కాదు. బాలీవుడ్ లో సైతం సినిమాలు నిర్మించిన అనుభవం ఉంది. మార్కెట్ పరంగా ఆయన్ని కొట్టేవారే లేరు. కానీ బన్నీ-చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గ స్టోరీ సెట్ అవ్వడం అన్నది అంత ఈజీ కాదు. ఆ ఇద్దరి ఇమేజ్ ని బేస్ చేసుకుని స్టోరీ రాసే సత్తా విజయేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ రైటర్ కే సాద్యం. ఆయన గనుకు పూనుకుంటే చరణ్-అర్జున్ పట్టాలెక్కడం పెద్ద విషయం కాదు. ఆ క్రేజీ కాంబోని దర్శకశిఖరం రాజమౌళి టేకప్ చేస్తే? అంతకుమించిన సంచలనం ఏముంటుంది.