Begin typing your search above and press return to search.

రైమ్ తో రామ్.. అదిరిపోయే సర్ ప్రైజ్ రెడీ!

ఇంతలో కుటుంబ సమేతంగా లండన్ ట్రిప్ కు వెళ్లారు. అదే సమయంలో తమ పెంపుడు శునకం రైమ్ ను కూడా తీసుకెళ్లారు.

By:  Tupaki Desk   |   19 July 2024 1:45 PM GMT
రైమ్ తో రామ్.. అదిరిపోయే సర్ ప్రైజ్ రెడీ!
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్ లో గేమ్ ఛేంజర్ రూపుదిద్దుకుంటోంది. మరో రెండు మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి.. ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి చరణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని చరణ్ తో పాటు మేకర్స్ కూడా అనౌన్స్ చేశారు. త్వరలోనే RC16 సెట్స్ లో అడుగుపెట్టనున్నారు చరణ్. ఇంతలో కుటుంబ సమేతంగా లండన్ ట్రిప్ కు వెళ్లారు. అదే సమయంలో తమ పెంపుడు శునకం రైమ్ ను కూడా తీసుకెళ్లారు. అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎక్కడికి వెళ్లినా రైమ్ ను తీసుకెళ్లడం కామనే.

తమ గారాలపట్టి క్లీంకార జన్మించాక.. ఒకరి చేతుల్లో బుజ్జి పాపాయి ఉంటే.. రైమ్ మరొకరి చేతుల్లో ఉండడం అనేక సార్లు చూసే ఉంటాం. అయితే ఇప్పుడు రైమ్ తో కలిసి చరణ్.. లండన్ లో ఓ స్పెషల్ ఫోటో షూట్ కు హాజరవుతున్నారు. అందుకోసం తన రైమ్ తో పాటు చెర్రీ రెడీ అయిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు రామ్ చరణ్ అభిమానులు.

అయితే పిక్స్ లో రామ్ చరణ్.. స్పెషల్ అండ్ కూల్ ఔట్ ఫిట్ లో అదిరిపోయారు. రైమ్ ఎప్పటిలాగే క్యూట్ గా ఉంది. ఫోటో షూట్ కోసం వెయిటింగ్ అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇక లండన్ నుంచి తిరిగి వచ్చాక.. RC 16 షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఉప్పెనతో రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు సనా.. ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా తెరకెక్కించనున్నారు. టైటిల్ ను 'పెద్ది'గా ఫిక్స్ చేసినట్లు టాక్.

RC16లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. దేవర తర్వాత తెలుగులో ఆమె చేస్తున్న రెండో చిత్రం ఇదే. మూవీలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇటీవల ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అదిరిపోయే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా.. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కతున్నట్లు తెలుస్తోంది.