లవ్‌లీ మెగా కపుల్ మూగ భాష
మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఎంతగా ఎదిగినా అంతగా ఒదిగి ఉండేవాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 17 April 2024 6:49 AM GMTమెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఎంతగా ఎదిగినా అంతగా ఒదిగి ఉండేవాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్నేహితురాలు ఉపాసనను పెళ్లాడి ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. క్లిన్ కారా ఈ అద్భుతమైన జంట వారసురాలు. చరణ్ ఎల్లపుడూ ఆదర్శనీయమైన భర్తగా, ఫ్యామిలీమ్యాన్ గాను గుర్తింపు తెచ్చుకున్నాడు. చరణ్- ఉపాసన దంపతుల అన్యోన్యత అన్నివేళలా చర్చనీయాంశమే. అభిమానులు ఆ ఇద్దరి ఫోటోలు - వీడియోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈసారి కూడా అలాంటి ఒక అందమైన వీడియో అంతర్జాలంలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో మెగా లవ్ లీ కపుల్ మూగభాషలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒకరికొకరు దూరంగా ఉన్న ఈ జంట కేవలం హావభావాలతోనే కమ్యూనికేట్ చేస్తున్న వీడియో నిజంగా క్యూట్ గా లవ్ లీగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్‌గా షేర్ అవుతోంది. ఇది ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్శిటీ లో డాక్టరేట్ అందుకున్నప్పటి వీడియో. చరణ్ పూర్తిగా వర్శిటీ డాక్టరేట్ అందుకునే క్రమంలో విభిన్నమైన అవతార్ లో కనిపిస్తున్నారు. వేదికపై కూచుని తననే గమనిస్తున్న తన భార్య ఉపాసనతో మూగ భాషల్లోనే కమ్యూనికేట్ చేస్తూ లవబుల్ గా కనిపించారు. ఉపాసన ఏదో గుసగుసగా చెబుతుంటే ఆ భాష తనొక్కడికే అర్థమైనట్టుగా చరణ్ ఎంత బాగా కమ్యూనికేట్ చేసారో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతోంది. ఆలి మూగ భాష మగనికే ఎరుక అంటారు ఇందుకే.
ఇప్పుడు ఈ వీడియో అభిమానుల్లో వైరల్‌గా మారుతోంది. చరణ్ ప్రతి అడుగులో ఉపాసన ఉన్నారు. అతడి ఫ్యాషన్ సెన్స్, ఎంపికల విషయంలోను ఉపాసన కమాండ్ ఉందన్న చర్చా సాగుతోంది. ముఖ్యంగా శంకర్‌తో గేమ్ ఛేంజర్ కోసం కఠోరంగా శ్రమిస్తున్న రామ్ చరణ్‌కి అన్ని విషయాల్లో ఉపాసన అండగా నిలుస్తున్నారు. ఇక కుటుంబానికి సమయం కేటాయించడం కోసం చరణ్ రాజీ లేని ప్లానింగ్, ఉపాసనతో అనన్యోన్యత.. కపుల్ గోల్స్.. అన్నివేళలా అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి.