Begin typing your search above and press return to search.

అంబానీ ఇంట్లో మన మెగా హీరో.. ఎందుకంటే!

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి జులై 12న గ్రాండ్ గా జరగబోతోంది.

By:  Tupaki Desk   |   11 July 2024 4:52 AM GMT
అంబానీ ఇంట్లో మన మెగా హీరో.. ఎందుకంటే!
X

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి జులై 12న గ్రాండ్ గా జరగబోతోంది. గత ఐదు నెలల నుంచి ఈ పెళ్లి హడావిడి నడుస్తోంది. అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ వేడుకని ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ముఖేష్ అంబానీ చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు. ముఖేష్ అంబానీ కూడా సెలక్టివ్ గానే అతిధులని ఆహ్వానిస్తూ ఉంటారు.

ఇండస్ట్రీలో ఎవరిని పిలిచిన కూడా అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకకి హాజరవుతారు. అతని స్థాయి అలాంటిది. అయితే ముఖేష్ అంబానీ సెలక్టివ్ గా మాత్రమే సెలబ్రెటీలని ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఈ పెళ్లి వేడుక కోసం వేల కోట్ల రూపాయిలు అంబానీ ఫ్యామిలీ ఖర్చు చేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఇంట్లో ఫుల్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. పాప్ సింగర్స్ ని సైతం వందల కోట్ల రూపాయిలతో సంగీత్ లో పాడటం కోసం తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈ పెళ్లి వేడుకకి సౌత్ లో అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానం లభించింది. వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉండటం విశేషం. రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఈ పెళ్లి వేడుకకి హాజరుకాబోతున్నాడు. ఎంగేజ్మెంట్ వేడుకకి కూడా రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లారు. అప్పుడు గ్లోబల్ స్టార్ కి అద్భుతమైన స్వాగతం లభించింది. టాలీవుడ్ నుంచి మెగా హీరో రామ్ చరణ్ మాత్రమే అనంత్ అంబానీ పెళ్లి వేడుక కోసం ముంబై వెళ్లబోతున్నాడు.

అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్ కి గెస్ట్ గా రామ్ చరణ్ వెళ్తున్నాడు అంటేనే అతని ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేసుకోవచ్చని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పెద్దవాళ్ళ ఇళ్లల్లో పెళ్లిళ్లకి సెలబ్రెటీలకి డబ్బులు ఇచ్చి పిలుస్తారని మరికొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేశాడు.

నెక్స్ట్ RC16 కోసం రామ్ చరణ్ సిద్ధం కాబోతున్నాడు. రెండు నెలల పాటు కంప్లీట్ గా ఈ సినిమాలో క్యారెక్టర్ మేకోవర్ పైన చరణ్ ఫోకస్ చేయబోతున్నాడంట. సెప్టెంబర్ లో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.