మొన్న ఎన్టీఆర్‌కు.. ఇప్పుడు చరణ్‌కు
అలానే తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాకు కూడా వన్నె తెచ్చిన ఈ ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని కూడా ముద్దాడింది
By: Tupaki Desk | 2 Nov 2023 4:39 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గుర్తింపు సాధించారు. రీసెంట్గా 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్'లో సభ్యత్వం పొందగా.. ఇప్పుడు చరణ్ కూడా ఈ అరుదైన గౌరవాన్ని పొందారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
వివరాళ్లోకి వెళితే.. 'రౌద్రం రణం రుధిరం'(RRR)తో చిత్రంతో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, సినిమాలో నటించిన రామ్ చరణ్ - ఎన్టీఆర్.. గ్లోబల్ వైడ్‌గా భారీ ఫేమ్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పెద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్‌గా మారారు.
అలానే తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాకు కూడా వన్నె తెచ్చిన ఈ ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని కూడా ముద్దాడింది. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డును అందుకుంది. అలానే రీసెంట్గా ఆస్కార్ అనౌన్స్ చేసిన యాక్ట్ర్స్ బ్రాంచ్ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చోటు దక్కించుకున్నారు.
అయితే ఇప్పుడు లేటెస్ట్గా మరికొందరు ప్రముఖ నటుల పేర్లతో ఓ జాబితాను రిలీజ్ చేసింది అకాడమీ. అందులో అనేక మంది హాలీవుడ్ నటులతో పాటుగా రామ్ చరణ్ పేరును కూడా జత చేసింది. తమ సరికొత్త సభ్యునిగా ఆహ్వానిస్తున్నట్టుగా ఆస్కార్ అకాడమీ నిర్వహకులు పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నటులను మా యాక్టర్స్ బ్రాంచ్‌లో ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. వీరు తమ నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను మనకు బహుమతిగా అందించారు అని ప్రశంసలు కురిపిస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
దీంతో మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు ప్రైడ్ మూమెంట్‌గా మారింది. ఇంకా ఈ లిస్ట్‌లో లషనా లించ్, విక్కీ క్రీప్స్, లూయిస్ కూ టిన్ లోక్, కెకె పామర్, చాంగ్ చెన్ కూడా ఉన్నారు. రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబుతో కలిసి ఓ చిత్రం చేయనున్నారు.