Begin typing your search above and press return to search.

చరణ్‌ కొత్త సినిమా స్పీడప్‌

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:05 AM GMT
చరణ్‌ కొత్త సినిమా స్పీడప్‌
X

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా కచ్చితంగా రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో అంతా వెయిట్‌ చేస్తున్నారు.

ఒక వైపు గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూనే మరో వైపు బుచ్చిబాబు సినిమా షూటింగ్‌ లో రామ్ చరణ్ పాల్గొనేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ఇన్నాళ్లు మందకోడిగా సాగాయి. చరణ్ అతి త్వరలోనే షూటింగ్ కు డేట్లు ఇవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ హడావుడి మొదలు అయింది.

ఇప్పటికే రెహమాన్ మ్యూజిక్ వర్క్ మొదలు అయిందట. రెహమాన్‌ తాను చరణ్ సినిమాకు వర్క్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే కొత్త సినిమా పనులు మొదలు పెట్టబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతంఓది.

ప్రస్తుతం బుచ్చిబాబు లొకేషన్స్ వేటలో ఉన్నాడు. స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయింది. అతి త్వరలోనే సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. చరణ్ కొత్త సినిమా పనులు స్పీడ్‌ అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే బుచ్చి బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.