Begin typing your search above and press return to search.

చరణ్‌, బుచ్చిబాబు మూవీ ఆసక్తికర కొత్త పుకారు!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   1 Oct 2023 2:30 AM GMT
చరణ్‌, బుచ్చిబాబు మూవీ ఆసక్తికర కొత్త పుకారు!
X

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా విడుదల అవ్వకుండానే బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమాకి చరణ్ కమిట్ అవ్వడం జరిగింది. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ తో సంబంధం లేకుండా బుచ్చి బాబు తన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ ఉన్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుచ్చిబాబు కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి చరణ్ మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడని.. అంతే కాకుండా హీరోయిన్‌ విషయం లో కూడా అంతకు మించి అన్నట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. బుచ్చి బాబు తన మొదటి సినిమా ఉప్పెన కి కృతి శెట్టిని తీసుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే.

కొత్త అమ్మాయిని తీసుకు రావడం వల్ల ఉప్పెన సినిమాకు సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయిందని, అందుకే చరణ్ మూవీ కోసం కూడా కొత్త అమ్మాయిని బుచ్చిబాబు వెతికే పనిలో ఉన్నాడు అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా బుచ్చిబాబు అన్వేషణ ఫలించింది. రవీనా టాండన్ కుమార్తె రాషా థదానిని ఎంపిక చేయడం జరిగిందనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు బచ్చిబాబు, చరణ్ కాంబో మూవీ హీరోయిన్ విషయం కానీ, ఇతర విషయాల గురించి కాని ఎలాంటి క్లారిటీ లేదు. అయినా కూడా మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. బుచ్చి బాబు నుండి ఫుల్ క్లారిటీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల రాషా ను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లుగా రవీనా ప్రకటించడం వల్ల ఈ కొత్త పుకార్లు పుట్టుకు వచ్చాయి. ఈ పుకార్లు నిజం అయితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌ కిడ్ అయిన రాషా కి నటన లో మంచి ప్రావిణ్యం ఉంది.. అంతే కాకుండా ఉత్తరాది ముద్దుగుమ్మ అవ్వడం వల్ల స్కిన్‌ షో విషయం లో మొహమాటం లేకుండా చూపిస్తుంది. అందుకే చరణ్ మూవీ లో రాషా అయితే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం.. పుకార్లు ఎంత వరకు నిజం అయ్యేను తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.