రామ్ చరణ్ కూడా తెగించేసేడా?
జూన్ నుంచి చరణ్ ఆ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడని వెలుగులోకి వచ్చింది. ఈలోపు గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి చరణ్ ప్రణాళిక అలా ఉంటుందని భావించారంతా.
By: Tupaki Desk | 17 May 2024 2:30 PM GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న `గేమ్ ఛేంజర్` రెండేళ్లగా సెట్స్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా సెట్స్ లోనూ ఉంది. తాజా సమాచారం ప్రకారం 80 శాతం పూర్తయిందని వార్తలొస్తున్నాయి గానీ అందులో నిజమెంతో తెలియదు. ఇక ఈ సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజు కూడా ఒకానొక సమయంలో అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ ఎప్పుడని అభిమానులు చంటేస్తుంటే? రిలీజ్ అయినప్పుడు అవుతుందిలే అని రాజుగారు కూడా లైట్ తీసుకున్నట్లు కనిపించింది.
ఇక రెండు నెలలుగా సినిమా అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని కూడా ప్రచారం సాగుతుంది. కానీ యూనిట్ నుంచి ఎలాంటి కన్పర్మేషన్ లేదు. సినిమాకి సంబంధించి ఏ అప్ డేట్ కూడా లేదు. షూటింగ్ జరుతుందని వార్తలొస్తున్నాయి తప్ప అదెక్కడన్నది? ఎవరికీ తెలియని పరిస్థితి . ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ కూడా తెగించేసినట్లు కనిపిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
జూన్ నుంచి చరణ్ ఆ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడని వెలుగులోకి వచ్చింది. ఈలోపు గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి చరణ్ ప్రణాళిక అలా ఉంటుందని భావించారంతా. కానీ గేమ్ ఛేంజర్ తో పనిలేకుండా 16వ చిత్రాన్ని పట్టాలెక్కించడానికే చరణ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిపరిస్థితుల్లో ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ చేసేద్దామని అందుకు అందర్నీ రెడీగా ఉండమని చరణ్ సంకేతాలు పంపారుట. చరణ్ ఇంత బలంగా నిర్ణయం తీసుకోవడానికి కారణంగా శంకర్ అలసత్వమేనని అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో ఉన్నప్పుడే శంకర్ సినిమాకి డేట్లు ఇచ్చాడు. కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. ఆర్ ఆర్ ఆర్ కంటే వెనుక ప్రారంభమైన ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మొదటి భాగం అక్టోబర్ 10న రిలీజ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆగస్టులోనే రిలీజ్ అవ్వాలి..కానీ షూట్ డిలే అవ్వడంతో అక్టోబర్ కి నిర్ణయించారు. ఆ తేదీకి పక్కాగా వచ్చే సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఇంకా శంకర్ సినిమా మీదనే కూర్చుంటే పవవ్వదనకున్నాడో? ఏమో! అందుకే చరణ్ జూన్ నుంచి కొత్త షూట్ కి వెళ్తున్నట్లు కనిపిస్తుంది.