Begin typing your search above and press return to search.

గ్లోబల్ స్టార్ సినిమా.. చాలా పెద్ద ప్లానే..!

సినిమా నుంచి జరగండి సాంగ్ రిలీజ్ చేయగా అది మెగా ఫ్యాన్స్ ని మెప్పించింది.

By:  Tupaki Desk   |   7 May 2024 3:52 AM GMT
గ్లోబల్ స్టార్ సినిమా.. చాలా పెద్ద ప్లానే..!
X

గ్లోబల్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా గేమ్ చేంజర్ గురించి మెగా ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ హిట్ టార్గెట్ పక్కా రీచ్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై పర్ఫెక్ట్ క్లారిటీ రాలేదు. అప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్ప సినిమా రిలీజ్ డేట్ లాక్ చేయలేదు. పోనీ సినిమా నుంచి ఏమైనా టీజర్, పోస్టర్స్ వదులుతున్నారా అంటే అది లేదు. సినిమా నుంచి జరగండి సాంగ్ రిలీజ్ చేయగా అది మెగా ఫ్యాన్స్ ని మెప్పించింది.

సినిమా గురించి మేకర్స్ అంతా ఇలా సైలెంట్ గా ఎందుకు ఉన్నారు అంటే దాని వెనక పెద్ద రీజనే ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా రిలీజ్ ముందే అంచనాలు పెంచి తీరా థియేటర్లకు వచ్చి నిరాశ చెందకుండా గేమ్ చేంజర్ లో చాలా విషయం ఉన్నా కూడా సినిమా ప్రమోషన్స్ ఆ రేంజ్ లో చేయట్లేదని తెలుస్తుంది. సినిమా నుంచి లీక్ వీడియోస్ వస్తున్నా.. మెగా ఫ్యాన్స్ సినిమా గురించి అప్డేట్స్ అడుగుతున్నా వాటినన్నింటిని లైట్ తీసుకున్నారు మేకర్స్.

అయితే గ్లోబల్ స్టార్ రాం చరణ్ ఇమేజ్ ని పెంచేలానే గేమ్ చేంజర్ ఉంటుందని ఇన్నర్ టాక్. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయట. అవి ఆడియన్స్ ని కచ్చితంగా మెస్మరైజ్ చేస్తాయని అంటున్నారు. గేమ్ చేంజర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. గ్లామర్ పరంగా కియరా కూడా హైలెట్ అవుతుందని టాక్. థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు హెల్ప్ అవుతుందని అంటున్నారు.

గేమ్ చేంజర్ పూర్తి చేశాక చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. ఆర్సీ 16వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో చరణ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తాడని టాక్. ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో చరణ్ తో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వి సెకండ్ సినిమానే చరణ్ తో ఛాన్స్ అందుకుంది.