రామ్ చరణ్ కార్ల కలెక్షన్ ఏ రేంజ్ లో ఉందంటే?
టాలీవుడ్ హీరోలలో ఒక్కొక్కరికి ఒక్కో ఇంటరెస్ట్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కి బైక్స్ కలెక్ట్ చేయడం అంటే ఇష్టం
By: Tupaki Desk | 14 July 2024 6:29 AM GMTటాలీవుడ్ హీరోలలో ఒక్కొక్కరికి ఒక్కో ఇంటరెస్ట్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కి బైక్స్ కలెక్ట్ చేయడం అంటే ఇష్టం. ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. నాగ చైతన్యకి డిఫరెంట్ కార్లు, బైక్ లు అంటే ఆసక్తి ఎక్కువ. ఎంత ఖరీదైన కూడా వాటిని కొనేస్తూ ఉంటాడు. రామ్ చరణ్ కి గుర్రాలు అంటే బాగా ఇష్టం. అలాగే కార్లు సేకరించడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. కొత్త కారు మార్కెట్ లోకి వచ్చిందంటే వీలైనంత తక్కువ టైంలోనే దానిని కొనేసి తన ఇంటికి తెచ్చుకుంటాడు.
అందుకే చరణ్ ఒక్కోసారి ఒక్కో కారులో కనిపిస్తూ ఉంటాడు. ఈ కార్లు అన్ని కూడా తన గ్యారేజ్ లో ఉంటాయి. తాజాగా ముంబైలో అనంత్ అంబానీ పెళ్లి వేడుకకి రామ్ చరణ్ వెళ్లారు. పెళ్లికి హాజరయ్యేందుకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి రామ్ చరణ్, ఉపాసన వెళ్లిన కారు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీనికి కారణం ఆ కారు గత ఏడాది జనవరిలోనే మార్కెట్ లోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా రామ్ చరణ్ తో పాటుగా మరొకరి దగ్గర మాత్రమే ఆ మోడల్ కారు ఉందంట.
ఆ కారే రోల్స్ రాయిస్ స్పెక్టర్. రోల్స్ రాయిస్ ఈ కారుని అడ్వాన్స్ వెర్షన్ గా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ధర 7.5 కోట్లు అని తెలుస్తోంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లలో ఇది కూడా ఒకటి. డిఫరెంట్ కంపెనీలకి చెందిన ఖరీదైన కార్లు రామ్ చరణ్ దగ్గర ఉన్నాయంట. ఆ కార్లు మోడల్స్, ధరలు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 మోడల్ కారు ధర సుమారు 4 కోట్లు.
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వీ8 ధర దాదాపు 3.2 కోట్లుగా ఉంది. ఫెరారీ పోర్టోఫినో కారు ధర సుమారు 3.50 కోట్లు కాగా, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ధర 2.75 కోట్లు ఉండొచ్చు. వీటితోపాటు బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు ధర సుమారు 1.75 కోట్లుగా ఉంది. రామ్ చరణ్ కార్లు కలెక్షన్స్ చూస్తుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. పాన్ ఇండియా స్టార్ గా గ్లోబల్ మార్కెట్ లోకి వెళ్తోన్న రామ్ చరణ్ ఇమేజ్ కి ఈ మాత్రం ఉండాల్సిందే అని అభిమానులు అంటున్నారు.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోయే RC16 మూవీ కోసం రెడీ అవుతున్నాడు. రెండు నెలల పాటు ఈ మూవీలో క్యారెక్టర్ మేకోవర్ కోసం రామ్ చరణ్ టైం స్పెండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.