Begin typing your search above and press return to search.

ఒత్తిడిలో త‌మ‌న్నాకి రామ్ చ‌ర‌ణ్ ఓదార్పు!

By:  Tupaki Desk   |   13 Aug 2023 7:21 AM GMT
ఒత్తిడిలో త‌మ‌న్నాకి రామ్ చ‌ర‌ణ్ ఓదార్పు!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-త‌మ‌న్నా జంట‌గా `ర‌చ్చ` సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు క‌లిసి న‌టించిన తొలి చిత్ర‌మ‌దే. ఆ త‌ర్వాత మ‌రో సినిమా చేసింది లేదు. మ‌రి వీరిద్ద‌రు ఎంత మంచి స్నేహితులో తెలుసా? ఇద్ద‌రు క‌లిసి ఎక్కువ సినిమాలు చేయ‌క‌పోయినా త‌క్కువ స‌మ‌యంలో మంచి స్నేహితులైన‌ట్లు తెలుస్తోంది. అలాగ‌ని చ‌ర‌ణ్ బెస్ట్ ప్రెండ్స్ లిస్ట్ లేరు. త‌మ‌న్నా బెస్ట్ ప్రెండ్ ఎవ‌రు? అంటే కాజ‌ల్ అగ‌ర్వాల్ అంది. ఇద్ద‌రు ముంబైలో త‌రుచూ క‌లుస్తుంటారుట‌.

సినిమాల గురించి కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడుకుంటారుట‌. కాజ‌ల్ కి జ‌న‌ర‌ల్ నాలెడ్స్ ఎక్కువ‌ట‌. ఏ విష‌యంపైనైనా గ‌ల‌గ‌లా మాట్లాడేస్తుంటుందిట‌. ఎంత సేపు మాట్లాడినా కాజ‌ల్ తో మాట్లాడ‌ల‌నిపిస్తుందిట‌. అయితే ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే మాత్రం ఎంత మంది బెస్ట్ ప్రెండ్స్ ఉన్నా..ఎవ‌రికీ ఫోన్ చేయ‌ద‌ట‌. ఒక్క రామ్ చ‌ర‌ణ్ కే ఫోన్ చేస్తుందిట‌. అత‌ను ఎంత బిజీగా ఉన్నా త‌మ‌న్నా కాల్ వెంట‌నే లిప్ట్ చేస్తాడుట‌. ఆస‌మ‌యంలో ఎంతో కూల్ గా మాట్లాడుతాడుట‌. విలువైన స‌ల‌హాలు ఇస్తుంటాడుట‌.

జీవితానికి సంబంధించిన విలువైన సూచ‌న‌లు చేస్తుంటాడుట‌. ఇవ‌న్నీ త‌మ‌న్నా ఎంతో శ్ర‌ద్ద‌గా వింటుందిట‌. చ‌ర‌ణ్ తో మాట్లాడుతుంటే స‌మ‌యం తెలియ‌ద‌ట‌. ఒత్తిడి అంతా మ‌టు మాయం అయిపో తుందిట‌. ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా చ‌ర‌ణ్ తో మాట్లాడితే మ‌న‌సు కుదుట ప‌డుతుందిట‌. చ‌ర‌ణ్ తో త‌మ‌న్నా అంత క్లోజ్ గా మూవ్ అవుతుంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం త‌మ‌న్నా- విజ‌య్ వ‌ర్మ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల రిలీజ్ అయిన `ల‌స్ట్ స్టోరీస్` లో రొమాంటిక్ స‌న్నివేశాల్లో మెప్పించిన వైనం అంత‌టా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏ హీరోతో తెర‌పై లిప్ లాక్ స‌న్నివేశాల్లో న‌టించ‌ని త‌మ‌న్నా తొలిసారి విజ‌య్ వ‌ర్మ‌తో అలాంటి స‌న్నివేశాల్లోనూ న‌టించింది. ప్రేమించి వాడు..పెళ్లి చేసుకునే వాడు కావ‌డంతోనే ఆ ధైర్యం చేసింది.