Begin typing your search above and press return to search.

RC 16: రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చరణ్ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 8:17 AM GMT
RC 16: రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చరణ్ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన కంటెంట్, అంతే బలమైన క్యారెక్టరైజేషన్ ఉన్న మూవీస్ కి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ చేసే సినిమాలు కథాబలం ఉన్నవే కావడం విశేషం. ఆచార్య మూవీ కమర్షియల్ జోనర్ లో చేసిన అది పూర్తినిడివి పాత్ర కాదు. యూనివర్సల్ యాక్టర్ గా తన బ్రాండ్ కి తగ్గ ఇమేజ్ సాధించాలంటే బలమైన పాత్రలు ఎంపిక చేసుకోవాలని చరణ్ ఫిక్స్ అయ్యారు.

ఆర్ఆర్ఆర్ లో రామరాజు క్యారెక్టర్ సినిమాకి ప్రధాన పిల్లర్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. గేమ్ చేంజర్ లో డ్యూయల్ లో చేస్తున్నాడు. అందులో తండ్రి పాత్రలో ఒక పొలిటికల్ లీడర్ గా చరణ్ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ పీరియాడిక్ జోనర్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

RC16 వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయిన ఈ సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీ ఉత్తరాంధ్ర నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కనుంది. చరణ్ ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ కోసం స్లాంగ్ నేర్చుకునే పనిలో ఉన్నారు. RC16 మూవీలో చరణ్ ఒక ట్రైబల్ స్పోర్ట్స్ మెన్ పాత్రలో కనిపిస్తాడంట. ఆ పాత్ర చాలా బలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.

ఇక ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తున్నారంట. తాజాగా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ చరణ్ క్యారెక్టర్ పార్ట్ అంతా కంప్లీట్ అయ్యింది. దీంతో బుచ్చిబాబు మూవీపై చరణ్ దృష్టిపెట్టారు. ఈ క్యారెక్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ లుక్ కోసం చరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పూర్తిగా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేస్తారంట.

RC16 సినిమా కథ గురించి సుకుమార్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. సరికొత్త రామ్ చరణ్ ను చూడబోతున్నారు అని తన స్టూడెంట్ మరో హిట్ కొట్టబోతున్నాడు అని తెలియజేశారు. అలాగే ఉప్పెన మూవీ తర్వాత బుచ్చిబాబు ఇదే కథతో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. చాలా కాలం తర్వాత రెహమాన్ తెలుగులో మ్యూజిక్ అందిస్తోన్న సినిమా RC16 కావడం విశేషం.