Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ - రైమ్.. కాంబినేషన్ లో..

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ షూటింగ్ రామ్ చరణ్ పూర్తి చేశాడు.

By:  Tupaki Desk   |   17 July 2024 11:30 AM GMT
రామ్ చరణ్ - రైమ్.. కాంబినేషన్ లో..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ‘ఆర్ఆర్ఆర్’ తో దేశ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించింది. నార్త్ ఇండియన్ ఆడియన్స్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు. గతంలో చరణ్ హిందీలోచేసిన ‘జంజీర్’ డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా సమయంలో యాక్టింగ్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం ఆయన ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ షూటింగ్ రామ్ చరణ్ పూర్తి చేశాడు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 సినిమా కోసం చరణ్ సిద్ధం అవుతున్నారు. ఈ క్యారెక్టర్ లుక్ కోసం చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావొచ్చు. ఇదిలా ఉంటే ఇండియన్ సెలబ్రెటీలకి లండన్ లో మేడమ్ టుస్సాడ్ లో మైనపు విగ్రహాలు పెట్టడం ఎప్పటి నుంచో జరుగుతోంది.

ఇపప్టికే టాలీవుడ్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, డార్లింగ్ ప్రభాస్ మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో పెట్టారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా పెట్టబోతున్నారంట. ఇదంతా బాగానే ఉంది. అయితే రామ్ చరణ్ విగ్రహంతో పాటు ఆయన చేతిలో ఉన్న కుక్కపిల్ల రైమ్ విగ్రహం కూడా తయారు చేస్తున్నారంట. రామ్ చరణ్ కి అత్యంత ఇష్టమైన డాగ్ రైమ్. ఇది ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందింది. చరణ్ ఖాళీ సమయం దొరికితే రైమ్ తో స్పెండ్ చేస్తాడు.

అలాగే ఎక్కడికి వెళ్లిన కచ్చితం రైమ్ ని తనతో పాటు చరణ్ తీసుకొని వెళ్తాడు. ఇది చాలా ఖరీదైన శునకం. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం కోసం కొలతలు తీసుకోవడానికి వచ్చినపుడు రామ్ చరణ్ తో పాటుగా రైమ్ కూడా ఉందంట. ఆ శునకం విగ్రహాన్ని కూడా రామ్ చరణ్ తో కలిసి ఉండేలా డిజైన్ చేయడానికి మ్యూజియం నిర్వాహుకులు ఇంటరెస్ట్ చూపించారంట.

దీంతో టుస్సాడ్ మ్యూజియంలో మొదటిసారి ఒక సెలబ్రెటీతో పాటు అతనికిష్టమైన శునకాన్ని కూడా పెట్టబోతున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ పెంచుకోవడం వలన రైమ్ కి దక్కిన గౌరవం ఇది అని చెప్పాలి. త్వరలో ఈ మైనపు విగ్రహాన్ని సందర్శకులకి అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందంట.