Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ఫెస్టివల్ మిస్... చరణ్‌ ప్రయత్నం!

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   23 Jun 2024 5:59 AM GMT
ఎన్టీఆర్‌ ఫెస్టివల్ మిస్... చరణ్‌ ప్రయత్నం!
X

టాలీవుడ్‌ తో పాటు ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా స్టార్‌ హీరోలు తమ సినిమాలను ప్రత్యేకమైన రోజుల్లో ముఖ్యంగా పెద్ద పండుగల సమయంలో విడుదల చేయాలని భావిస్తారు. సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్‌, రంజాన్ లతో పాటు మరి కొన్ని పండుగలకు హీరోలు తమ సినిమాలను తీసుకు రావడం మనం చూస్తూ ఉంటాం.

పండుగల సీజన్ లో ఎక్కువ సెలవు దినాలు ఉంటాయి. కనుక ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు అనే ఉద్దేశ్యంతో ఎప్పటి నుంచో పండుగలకు పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి. అందరు హీరోలు పండుగలకే రావాలంటే కష్టం. కనుక కొన్ని సార్లు పండుగకు రావాలని అనుకున్న సాధ్యం కాదు.

ఎన్టీఆర్‌ దేవర సినిమా తో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అక్టోబర్‌ 10న విడుదల చేయాలనుకున్న దేవర సినిమాను రెండు వారాల ముందుగానే విడుదల చేయబోతున్నారు. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.

దసరా కి ఎన్టీఆర్‌ దేవరతో వస్తే మంచి ఫలితం దక్కేది, కానీ కొన్ని కారణాల వల్ల ముందే రావాల్సి వస్తుంది. ఎన్టీఆర్‌ మిస్ చేసుకున్న ఫెస్టివ్‌ సీజన్ ను రామ్‌ చరణ్ ఒడిసి పట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా చరణ్ గేమ్‌ చేంజర్ సినిమా విడుదల విషయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆమధ్య అక్టోబర్‌ లోనే గేమ్‌ ఛేంజర్ ఉంటుంది అంటూ దిల్‌ రాజు కూతురు చెప్పిన విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. దసరా లేదా దీపావళి సీజన్‌ ను గేమ్‌ ఛేంజర్‌ సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడంతో పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కనుక దీపావళి కి వస్తే కచ్చితంగా మంచి ఫలితం దక్కడం ఖాయం.