రామ్ చరణ్.. ఆ పనులు ఎంతవరకు వచ్చాయంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను మొదలుపెట్టి చాలా కాలం అయింది
By: Tupaki Desk | 19 March 2024 10:21 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను మొదలుపెట్టి చాలా కాలం అయింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాపై మెగా ఫ్యాన్స్ లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎప్పుడో గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సినిమా షూటింగ్ అసలు ఎంతవరకు వచ్చింది, అసలు అప్డేట్స్ అనుకున్న సమయానికి ఇస్తారా లేదా అనే విషయంలో మేకర్స్ ఆలోచన విధానం ఎవరికి అర్థం కావడం లేదు. దర్శకుడు శంకర్ కమల్ హాసన్ ప్రాజెక్టు ఇండియన్ 2 ద్వారా బిజీ కావడం వల్ల ఈ ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇప్పటికే గేమ్ చేంజర్ కు అనుకున్న బడ్జెట్ కూడా కాస్త పెరిగిపోయింది అనే విధంగా గాసిప్స్ అయితే వస్తూ ఉన్నాయి.
ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా రామ్ చరణ్ రాజు కూడా శంకర్ ను అర్థం చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన కొన్ని ఫోటోలు కూడా ఓవర్గం ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. దర్శకుడు శంకర్ ఆలస్యం చేసినప్పటికీ మంచి అవుట్ ఫుట్ అందించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఒక పాటను విడుదల చేసే అవకాశం అయితే ఉంది.
ఇక ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయింది అనే వివరాల్లోకి వెళితే మాత్రం రీసెంట్ గా మొదలైన వైజాగ్ షెడ్యూల్ పూర్తయింది. ఇక రెండు రోజులు గ్యాప్ తీసుకొని ఈనెల 21 నుంచి హైదరాబాదులో మరొక కీలకమైన షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఇక ఈ షెడ్యూల్ ఫినిష్ అయితే దాదాపు సినిమా టాకీ వర్క్ ఫినిష్ అయినట్లే అని చెప్పవచ్చు. ఇక దీని తర్వాత వరస అప్డేట్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.
మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా కూడా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు ఫినిష్ చేసుకున్నాడు. ఇక రాంచరణ్ వస్తే తన పాత్రకు సంబంధించిన కొంత వర్క్ షాప్ నిర్వహించి ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా రామ్ చరణ్ ఇదే ఏడాది చివరిలో ఫినిష్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. మరి ఆ దిశగా దర్శకుడు బుచ్చిబాబు పనిలో వేగాన్ని పెంచుతాడో లేదో చూడాలి.