Begin typing your search above and press return to search.

గేమ్‌ ఛేంజర్‌.. ఆ డౌట్‌ అక్కర్లేదట!

రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   18 July 2024 6:05 AM GMT
గేమ్‌ ఛేంజర్‌.. ఆ డౌట్‌ అక్కర్లేదట!
X

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్‌ చరణ్ చేస్తున్న మూవీ గేమ్‌ ఛేంజర్‌. గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న చరణ్‌ కి గేమ్‌ ఛేంజర్‌ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందా అంటూ మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ఇండియన్ 2 అతి పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో మెగా ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యింది.

మెగా ఫ్యాన్స్ కి గేమ్‌ ఛేంజర్ విషయంలో ఉన్న ఆందోళన తగ్గించే విధంగా రచయిత సాయి మాధవ్‌ బుర్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఆయన ఒక చిట్‌ చాట్‌ లో మాట్లాడుతూ... నేను సెట్స్ కి ఎక్కువ వెళ్లలేదు. కానీ దర్శకుడు శంకర్ గారితో డైలాగ్స్ గురించి మాట్లాడిన సమయంలో ఆయన చెప్పిన విషయాలు సినిమాపై డౌట్ అక్కర్లేదు అన్నట్లుగా ఉండటంతో పాటు అంచనాలు పెంచాయి.

ఆయన మార్క్‌ మంచి సినిమాగా గేమ్‌ ఛేంజర్‌ ఉంటుందని, అలాగే చరణ్‌ కెరీర్‌ లో నిలిచి పోయే సినిమాగా కూడా ఉంటుందని సాయి మాధవ్‌ బుర్రా చెప్పుకొచ్చాడు. చరణ్‌ మరియు శంకర్‌ లు ఈ సినిమా కోసం చాలా డెడికేషన్ తో వర్క్‌ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి గేమ్‌ ఛేంజర్‌ కోసం వర్క్ చేస్తున్నారని అన్నాడు.

రామ్‌ చరణ్ ను గేమ్ ఛేంజర్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో చూడబోతున్నాం. ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.. కానీ ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని మాత్రం చెబుతూ ఉన్నారు. చరణ్‌ కి జోడీగా కియారా అద్వానీ మరియు అంజలి లు నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతుంది.