Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. పెరుగుతున్న బడ్జెట్ భయం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Sep 2023 5:45 AM GMT
గేమ్ ఛేంజర్.. పెరుగుతున్న బడ్జెట్ భయం
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాలని అనుకున్నారు. శంకర్ కూడా అదే బడ్జెట్ లో చేయాలని సినిమాని స్టార్ట్ చేశారు. ఇండియన్ 2 మూవీ ఆగిపోవడంతో శంకర్ గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేశారు.

అయితే ఇండియన్ 2 ప్రొడ్యూసర్స్ తో వివాదం ముగియడంతో మరల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. దీంతో రెండు పాన్ ఇండియా సినిమాలని ఒకేసారి శంకర్ చేస్తున్నారు. అయితే శంకర్ ఫోకస్ అంతా ఇండియన్ 2 పూర్తి చేయడంపైన ఉందనే మాట వినిపిస్తోంది. గేమ్ చేంజర్ షూటింగ్ ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే కంప్లీట్ అయ్యిందంట.

ఇప్పటికే 200 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చయ్యిందట. అనుకున్న బడ్జెట్ ఇప్పటికే క్రాస్ అయిపొయింది. ఇంకా చాలా షెడ్యూల్స్ పెండింగ్ లో ఉన్నాయి. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 370 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ స్థాయిలో బడ్జెట్ అంటే మార్కెట్ రేంజ్ కి మించి ఖర్చు పెడుతున్నట్లే అవుతుంది. ఇప్పటికే దిల్ రాజు గేమ్ చేంజర్ విషయంలో శంకర్ పై కొంత అసంతృప్తితో ఉన్నారు.

ఈ మధ్య జరిగిన ఓ ప్రెస్ మీట్ లో మూవీ రిలీజ్ విషయం చర్చకి వస్తే అంతా డైరెక్టర్ చేతిలోనే ఉందని, అతను ఎప్పుడు ఇస్తే అప్పుడే రిలీజ్ అవుతుందని నవ్వుతూనే తన అసహనాన్ని దిల్ రాజు వ్యక్తం చేశారు. దీనిని బట్టి మూవీ బడ్జెట్ కంట్రోల్ దిల్ రాజు చేతుల్లోంచి జారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. 370 కోట్ల బడ్జెట్ అంటే ఆర్ఆర్ఆర్ RRR రేంజ్ లో అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ బడ్జెట్ లో సినిమా అంటే చరణ్ మార్కెట్ రేంజ్ కి మించి ఖర్చు చేస్తున్నట్లే. ఈ మొత్తం రాబట్టాలంటే కచ్చితంగా థీయాత్రికల్ బిజినెస్ 400 కోట్లకి పైగా జరగాలి. అంత జరిగిన మొత్తం తిరిగి వస్తుందని గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా సగం రికవరీ అయిన మిగిలిన మొత్తం కూడా రాబట్టడం తలకుమించిన భారమే. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే తప్ప ఈ మొత్తం రికవరీ కాదు. మరి దిల్ రాజు దీనిని ఎలా డీల్ చేస్తారో చూడాలి.